Anjali: సంతోషంలో గంతులేస్తున్న అందాల అంజలి.. ఇంతకీ హ్యాపినెస్‌ కారణమేంటో తెలుసా.?

Anjali: 2006లో వచ్చిన ఫొటో చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది తెలుగమ్మాయి అంజలి. తొలి సినిమాతో తన న్యాచురల్‌ నటతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం తమిళం, కన్నడ, మలయాళం..

Anjali: సంతోషంలో గంతులేస్తున్న అందాల అంజలి.. ఇంతకీ హ్యాపినెస్‌ కారణమేంటో తెలుసా.?
Anjali
Follow us

|

Updated on: Aug 28, 2022 | 10:09 AM

Anjali: 2006లో వచ్చిన ఫొటో చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది తెలుగమ్మాయి అంజలి. తొలి సినిమాతో తన న్యాచురల్‌ నటతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం తమిళం, కన్నడ, మలయాళం ఇండస్ట్రీల్లో వరుస ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోయింది. చాలా కాలం పాటు తెలుగు ప్రేక్షకులకు దూరంగా ఉన్న అంజలి మళ్లీ 2012లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో తెలుగు ఆడియన్స్‌ను పలకరించింది. ఈ సినిమాతో అంజలి తెలుగులో మళ్లీ బిజీ హీరోయిన్‌గా మారింది.

వరుస ఆవకాశాలు సొంతం చేసుకుంటూ తెలుగుతో పాటు, తమిళంలోనూ నటిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మాచర్ల నియోజకవర్గం చిత్రంలో ఐటెం సాంగ్‌లో నటించి కుర్రకారును మెస్మరైజ్‌ చేసింది. ఇక తాజాగా రామ్‌చరణ్‌-శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రంలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఈ సినిమాలో అంజలీ విలన్‌ పాత్రలో నటించనుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇలా వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపే అంజలి సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన వ్యక్తి, సినీ కెరీర్‌కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Anjali (@yours_anjali)

ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ఆసక్తికరమైన వీడియోను పోస్ట్‌ చేసింది అంజలి. సంతోషంగా గంతులేస్తోన్న సమయంలో తీసిన వీడియోను పోస్ట్‌ చేసిన అంజలి.. ‘జీవితంలో చిన్న చిన్న విషయాలకు సంతోషపడాలి’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను రాసుకొచ్చింది. ఈ వీడియో చూసిన ఆమె ఫ్యాన్స్‌ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Anjali (@yours_anjali)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..