Prabhas: రాజాసాబ్ స్పెషల్ సాంగ్ కోసం ఆ బ్యూటీ.. 17 ఏళ్ల తర్వాత ప్రభాస్‏తో ఆ హీరోయిన్ స్టెప్పులు..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు డార్లింగ్. దీంతో ఇప్పుడు ప్రభాస్ నటిస్తోన్న సినిమాలపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

Prabhas: రాజాసాబ్ స్పెషల్ సాంగ్ కోసం ఆ బ్యూటీ.. 17 ఏళ్ల తర్వాత ప్రభాస్‏తో ఆ హీరోయిన్ స్టెప్పులు..
Prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 15, 2024 | 12:18 PM

డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 ఏడీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ప్రభాస్. ఈ సినిమా తర్వాత మళ్లీ తన కొత్త ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. కొన్ని నెలలుగా రాజాసాబ్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు డార్లింగ్. డైరెక్టర్ మారుతీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికే రాజాసాబ్ మూవీ గురించి హీరోయిన్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం ముగింపు దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

హారర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందంట. అయితే ఈ పాట కోసం ఓ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ ను రంగంలోకి దింపుతున్నారని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ హీరోయిన్ ఎవరనే విషయంపై క్లారిటీ వచ్చింది. ఆమె మరెవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార. రాజాసాబ్ సినిమాలో ప్రభాస్, నయనతార కాంబోలో ఓ స్పెషల్ సాంగ్ రాబోతుందట. ఈ పాట కోసం నయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. వచ్చే నెలలో ఈ సాంగ్ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈ హిట్ పెయిర్ రిపీట్ కాబోతుండడంతో ఫ్యాన్స్ ఈ సాంగ్ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రభాస్, నయనతార ఇద్దరు కలిసి యోగి చిత్రంలో నటించారు. 2007లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో వీరిద్దరి జోడి బాగుందంటూ కామెంట్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరు కలిసి స్పెషల్ సాంగ్ చేయనున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సంక్రాంతి కానుకగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కానుంది.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.