Allu Arjun-Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్..

Allu Arjun-Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్..

Rajitha Chanti

|

Updated on: Dec 15, 2024 | 12:06 PM

మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. చిరు ఫ్యామిలీతో కలిసి బన్నీ లంచ్ చేయనున్నారు. అనంతరం సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన గురించి చిరుతో మాట్లాడనున్నారు బన్నీ. అల్లు అర్జున్‌ అరెస్ట్ సమయంలో షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని హుటాహుటిన బన్నీ ఇంటికి వచ్చిన చిరంజీవి.

మెగాస్టార్ చిరంజీవికి ఇంటికి వెళ్లారు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో శుక్రవారం ఉదయం చిక్కడపల్లి పోలీసులు బన్నీని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ విషయం తెలియగానే షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని హుటాహుటిన బన్నీ ఇంటికి వచ్చిన చిరంజీవి.. బన్నీ కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ఆ తర్వాత వెంటనే చిక్కడపల్లి స్టేషన్‌కు చిరంజీవి వెళ్లాలనుకున్నారు. కానీ పోలీసులు వద్దని కోరటంతో అర్జున్ ఇంటి దగ్గరకు వెళ్లిన చిరంజీవి దంపతులు. శనివారం ఉదయం విడుదలైన బన్నీని నిన్న టాలీవుడ్ సినీప్రముఖులు పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు బన్నీ. మెగా ఫ్యామిలీతో కలిసి అల్లు అర్జున్ లంచ్ చేయనున్నారు. అనంతరం సంధ్య థియేటర్‌ ఘటన గురించి చిరంజీవితో మాట్లాడనున్నారు బన్నీ. పుష్ప 2 సక్సెస్ తరువాత తొలిసారి చిరంజీవిని కలుస్తున్నారు అల్లు అర్జున్‌.

Published on: Dec 15, 2024 12:05 PM