Naveen Polishetty: స్టాండప్ కమెడియన్గా మారిన నవీన్ పోలిశెట్టి.. ఎందుకంటే..
నవీన్ పోలిశెట్టి యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నవీన్ సరసన అందాల తార అనుష్క శెట్టి నటిస్తోంది. ఈ సినిమాకు పి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అనుష్క చెఫ్ పాత్రలో నటిస్తున్నారు.

జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకున్నాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. అంతకు ముందు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక తర్వాత వచ్చిన జాతిరత్నాలు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. డైరెక్టర్ అనుదీప్ కెవీ తెరకెక్కించిన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఇందులో తన నటనతో మరోసారి ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఈసినిమా తర్వాత అతను యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నవీన్ సరసన అందాల తార అనుష్క శెట్టి నటిస్తోంది. ఈ సినిమాకు పి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అనుష్క చెఫ్ పాత్రలో నటిస్తున్నారు.
ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా.సోమవారం హీరో నవీన్ పోలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆయన క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ సిద్ధు పోలిశెట్టి క్యారెక్టర్ లో కనిపించనున్నారు. కామెడీ టైమింగ్ లో మంచి పేరున్న నవీన్ స్టాండప్ కమెడియన్ గా మరింతగా నవ్వించనున్నారు.




ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. వచ్చే ఏడాది తెరపైకి రానున్న ఈ మూవీపై ఫిల్మ్ లవర్స్ లో మంచి అంచనాలున్నాయి. ఒక యువకుడికి.. మిడిల్ ఏజ్ అమ్మాయికి మధ్యన ప్రేమ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే అనుష్క ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయింది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Happy Birthday ? to the young sensation ?#NaveenPolishetty !
Introducing ‘Sidhu Polishetty’ aka @NaveenPolishety #AnushkaShetty #MaheshBabuP @radhanmusic #NiravShah #RajeevanNambiar @UV_Creations #ProductionNo14 #NaveenPolishetty3 #Anushka48 pic.twitter.com/k04fxy7FOL
— UV Creations (@UV_Creations) December 26, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
