Vijay Deverakonda: విజయ్ దేవరకొండ శాంటా సీక్రెట్ గిఫ్ట్స్ ఏంటో తెలుసా ?.. ఆ 100 మందికి బంపర్ ఆఫర్..

క్రిస్మస్ పురస్కరించుకుని గత ఐదేళ్లుగా ఫ్యాన్స్ అందరికీ బహుమతులు అందించడాన్ని ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఒక్కో ఏడాది ఒక్కో కాన్సెప్ట్ తో అభిమానుల నుంచి వారికేం కావాలో సమాధానాల రూపంలో తెలుసుకుని..

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ శాంటా సీక్రెట్ గిఫ్ట్స్ ఏంటో తెలుసా ?.. ఆ 100 మందికి బంపర్ ఆఫర్..
Vijay Deverakonda
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 26, 2022 | 3:09 PM

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అత్యంత భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ హీరోలలో విజయ్ దేవరకొండ. ఫ్యాన్స్ అంతా రౌడీ అంటూ ముద్దుగా పిలుచుకునే ఈహీరో..యాటీట్యూడ్‏కు ఫిదా అవుతుంటారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంటారు విజయ్. అంతేకాకుండా.. తన అభిమానులకు టచ్‏లో ఉంటూ.. వారి ప్రశ్నలకు ఒపికగా సమాధానలిస్తుంటారు. అయితే ఈ హీరోకు ప్రతి క్రిస్మస్‏కు తన ఫ్యాన్స్ కు గిఫ్ట్స్ ఇవ్వడం అలవాటు అన్న సంగతి తెలిసిందే. క్రిస్మస్ పురస్కరించుకుని గత ఐదేళ్లుగా ఫ్యాన్స్ అందరికీ బహుమతులు అందించడాన్ని ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఒక్కో ఏడాది ఒక్కో కాన్సెప్ట్ తో అభిమానుల నుంచి వారికేం కావాలో సమాధానాల రూపంలో తెలుసుకుని.. వారిలోంచి కొందరిని ఎంపిక చేసి గిఫ్ట్స్ అందిస్తుంటారు. తాజాగా ఈ ఏడాది కూడా దాదాపు 100 మంది అభిమానులను బంపర్ ఆఫర్ ఇచ్చేశారు విజయ్.

క్రిస్మస్ కానుకగా ఈ సంవత్సరం హాలీడే ట్రిప్ ప్లాన్ చేశారు విజయ్. “మీలోని 100 మందిని హాలీడే ట్రిప్ కు పంపించాలనుకుంటున్నాను. గమ్యాన్ని ఎంచుకోవడంలో నాకు సహాయం చేయండి” అని కోరుతూ ఇండియాలోని పర్వతాలు, చారిత్రక ప్రదేశాలు, బీచ్ లు , ఎడారిని సూచించారు. వీటిల్లో ఎక్కువ మంది పర్వతాలు చుట్టివచ్చేందుకు ఆసక్తి చూపించారు. ఇక తన ట్వీట్ కు వచ్చిన రిప్లైల ఆధారంగా విజయ్ 100 మందిని ఎంపిక చేసి.. వారిని తన ఖర్చులతో విహార యాత్రకు పంపిస్తారు.

ఇవి కూడా చదవండి

ఈఏడాది మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాతో థియేటర్లలో సందడి చేశారు విజయ్ దేవరకొండ. రూ. 200కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటించింది. ఇక ప్రస్తుతం విజయ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నారు. ఇందులో సమంత కథానాయికగా నటిస్తుండగా.. కృతి శెట్టి సెకండ్ హీరోయిన్ గా కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.