Jr.NTR: యూఎస్‏లోని ఆ రెస్టారెంట్‏పై ఎన్టీఆర్ ప్రశంసలు.. వైరలవుతున్న ఇన్ స్టా పోస్ట్.. ఇంతకీ మ్యాటరెంటంటే..

తాజాగా తారక్ ఇన్ స్టా పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో తారక్ ఓ రెస్టారెంట్ పై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా అక్కడున్న సిబ్బందితో ఫోటోలకు ఫోజులిచ్చాడు.

Jr.NTR: యూఎస్‏లోని ఆ రెస్టారెంట్‏పై ఎన్టీఆర్ ప్రశంసలు.. వైరలవుతున్న ఇన్ స్టా పోస్ట్.. ఇంతకీ మ్యాటరెంటంటే..
Ntr Jr
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 26, 2022 | 3:43 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అమెరికా ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లిన తారక్.. కుమారులు.. సతీమణితో కలిసి బ్రేక్ సమయాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తారక్ ఇన్ స్టా పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో తారక్ ఓ రెస్టారెంట్ పై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా అక్కడున్న సిబ్బందితో ఫోటోలకు ఫోజులిచ్చాడు. న్యూయార్క్ లోని జునూన్ అనే పాపులర్ ఇండియన్ రెస్టారెంట్ స్టోరీ పోస్ట్ చేశాడు. “అంతర్జాతీయ పర్యటనలో బహుశా అత్యుత్తమ ఇండియన్ ఫుడ్ లభించవచ్చు.. జునూన్, NYCలో నా టేస్ట్ బడ్స్ ను సంతృప్తిపరిచిన స్పైసీ పీస్. అమేజింగ్ ” అంటూ చెప్పుకొచ్చాడు .

ఇక తాజాగా షేర్ చేసిన ఫోటోలో రెస్టారెంట్ సిబ్బంది నవ్వుతుండగా… తారక్ మాత్రం పెరిగిన గడ్డం.. మీసాలతో కొత్త లుక్ లో కనిపించాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న తారక్.. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో #NTR30 సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించినున్నారు.

ఇవి కూడా చదవండి
Ntr

Ntr

ఇఖ ఈ మూవీ కాకుండా.. కేజీఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలోని నటీనటులకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.