Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్‏‏ది ఆత్మహత్య కాదు.. హత్యే.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన పోస్ట్ మార్టం చేసిన డాక్టర్..

బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోలేదని.. తనది హత్యే అన్నారు డాక్టర్ రూప్ కుమార్ షా. సుశాంత్ శరీరంపై మెడపై అనేక గుర్తులు ఉన్నాయని.. అధికారులకు తెలియజేసిన ఫలితం లేకుండాపోయిందన్నారు.

Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్‏‏ది ఆత్మహత్య కాదు.. హత్యే.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన పోస్ట్ మార్టం చేసిన డాక్టర్..
Sushant Singh Rajput
Follow us

|

Updated on: Dec 26, 2022 | 5:53 PM

సుశాంత్ సింగ్ రాజ్‏పుత్.. ఇప్పటికీ ప్రేక్షకుల కళ్లముందు కదలాడుతున్న ఓ యువకుడి రూపం. వెండితెరపై హీరోగా ఎదగాలని ఎన్నో ఆశలతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ముందుగా బుల్లితెరపై నటుడిగా అరంగేట్రం చేసి.. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎదిగాడు. ఎంఎస్ ధోని చిత్రంతో సుశాంత్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుని పాన్ ఇండియా స్టార్‏గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా ఎఫెక్ట్.. సుశాంత్ తో సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపించారు. అలా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి అగ్రకథానాయికుడిగా కొనసాగుతున్న సమయంలోనే సుశాంత్ ఆత్మహత్య ఒక్కసారిగా ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. అప్పటివరకు ఎంతో సరదాగా.. యాక్టివ్‏గా కనిపించిన సుశాంత్.. క్షణాల వ్యవధిలోనే తన గదిలో ఫ్యాన్‏కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. సుశాంత్ సింగ్ మరణం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. అతను ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు భావిస్తుంటే.. మరికొందరు మాత్రం హత్యా అంటూ బలంగా వాదించారు. దీంతో సుశాంత్ మరణం సీబీఐ చేతికి వెళ్లింది. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలీంది. కానీ సుశాంత్ మరణించి రెండేళ్లు పూర్తయిన ఇప్పటికీ విచారణ పూర్తి కాలేదు. తాజాగూ సుశాంత్ మరణం గురించి సంచలన విషయాలను బయటపెట్టారు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ రూప్ కుమార్ షా.. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని.. హత్యే అని తెల్చేశారు.

“సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించినప్పుడు.. అదే సమయంలో పోస్ట్‌మార్టం కోసం కూపర్ హాస్పిటల్‌లోకి ఐదు మృతదేహాలు వచ్చాయి.. ఆ ఐదు మృతదేహాల్లో ఒకటి వీఐపీదే అని చెప్పారు.. మేము పోస్ట్ మార్టం చేయడానికి వెళ్ళినప్పుడు, అతను సుశాంత్ సింగ్ అని గుర్తుపట్టాం. అతని శరీరంపై అనేక గుర్తులు ఉన్నాయి. అతని మెడపై రెండు నుంచి మూడు గుర్తులు ఉన్నాయి. పోస్ట్‌మార్టం రికార్డ్ చేయాల్సి ఉంది. కానీ అయితే మృతదేహానికి సంబంధించిన ఫోటోలను మాత్రమే తీయాలని ఉన్నతాధికారులను కోరారు. అందుకే, వారి ఆదేశానుసారం మేము అలా చేసాము.

అంతేకాకుండా.. సుశాంత్ ఆత్మహత్య కాదు.. హత్య అని అధికారులకు చెప్పాము.. కానీ వారు ఆ విషయాన్ని చెప్పకుండా నిబంధనల ప్రకారం పని చేయమని అడిగారు. వెంటనే సుశాంత్ హత్య గురించి మా సీనియర్స్ కు తెలియజేసాము. వారు కూడా నిబంధనల ప్రకారం చేయాలని చెప్పారు. అంతేకాకుండా తొందరగా బాడీ ఫోటోస్ తీసి మృతదేహాన్ని తమకు అప్పగించాలని పోలీసులు చెప్పారు. అందుకే రాత్రిపూట మాత్రమే పోస్ట్ మార్టం చేశాం. ” అని తెలిపారు. ఇక డాక్టర్ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

2020లో జూన్ 14న సుశాంత్ ముంబైలోని తన అపార్ట్ మెంట్ లో ఉరివేసుకుని కనిపించారు. అతని అకాల మరణంతో ఫ్యాన్స్ షాకయ్యారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు చెప్పగా.. హత్యే అంటూ అభిమానులు నిరసన చేశారు. అప్పట్లో జస్టిస్ ఫస్ ఎస్ఎస్ఆర్ అనే హ్యాష్ ట్యాగ్ లను ట్రెండ్ చేసి తమ వాదనను గట్టిగా వినిపించారు. ఇక సుశాంత్ సింగ్ సూసైడ్ ఎఫెక్ట్..ఇప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీని వెంటాడుతుందనే చెప్పుకోవాలి. గత రెండేళ్లుగా బాలీవుడ్ వరుస డిజాస్టర్లతో తీవ్ర నష్టాల్లో మునిగిపోయింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.