Anasuya: స్పెషల్ సాంగ్‌లో స్పెప్పులేయనున్న అందాల యాంకరమ్మ అనసూయ.. ఏ సినిమాలో అంటే..
అటు యాంకర్‌గా కొనసాగుతునే ఇటు సినీ పరిశ్రమలో వరుస ఆఫర్లు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అనసూయ. ప్రస్తుతం ఆమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప 2 చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
బుల్లితెరపై యాంకర్‌గా కెరీర్ ఆరంభించిన అనసూయ.. ప్రస్తుతం వెండితెరపై రాణిస్తోంది. ఎన్నో చిత్రాల్లో కీలకపాత్రలలో తన నటనతో ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అనసూయ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత క్షణం, కథనం, వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. అటు యాంకర్‌గా కొనసాగుతునే ఇటు సినీ పరిశ్రమలో వరుస ఆఫర్లు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అనసూయ. ప్రస్తుతం ఆమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప 2 చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక లేటేస్ట్ టాక్ ప్రకారం ఈ సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ చేయనుందట. పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సుకుమార్.. ఇప్పుడు ఈ చిత్రానికి సిక్వెల్ తీస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తుండగా.. అనసూయ, సునీల్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి కొద్ది రోజులగా క్రేజీ రూమర్స్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. తాజాగా మరో రూమర్ వినిపిస్తోంది.
ఫస్ట్ పార్ట్ లో ఊ అంటావా మావ అంటూ స్పెషల్ సాంగ్ తో మాయ చేసింది సమంత. ఈ పాటకు ఏ రెంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో తెలిసిన విషయమే. సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం ఈ పాటకు కాలు కదిపారు. ఇక ఇప్పుడు పుష్ప 2లోనూ స్పెషల్ ఉండనుందని.. ఫస్ట్ పార్ట్ కు మించి సెకండ్ పార్ట్ లో స్పెషల్ సాంగ్ మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సాంగ్ కోసం అనసూయను సెలక్ట్ చేసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
మొదటి పార్ట్ లో అనసూయ.. ప్రతినాయకుడిగా ఉన్న సునీల్ భార్య పాత్రలో కనపించింది. ఫుల్ నెగిటివ్ క్యారెక్టర్ లో అదరగొట్టింది అనసూయ. ఇక పుష్ప 2లో ఆమె పాత్ర నిడివి ఎక్కువగానే ఉంటుందని.. ఊహించని ఎలివేషన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు స్పెషల్ సాంగ్ అని వార్తలు వినిపిస్తుండడంతో పుప్ప 2పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.