Samantha: సమంత ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. వర్కవుట్స్‌తో పాటు అది కూడా ముఖ్యమే అంటున్న సామ్.. వీడియో వైరల్..
కేవలం వర్కవుట్స్ మాత్రమే కాదు..మనం తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యమంటుంది సమంత. గతంలో తన ఇంట్లోని గార్డెన్ ఏరియాలో వర్కవుట్స్ చేస్తున్న వీడియో షేర్ చేస్తూ తాను తీసుకునేఫుడ్ గురించి చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న అగ్రకథానాయికలలో సమంత ఒకరు. ఎన్నో హిట్స్ చిత్రాల్లో నటించి ప్రశంసలు అందుకున్న సామ్.. గత కొద్ది నెలలుగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతుంది. ఇంట్లోనే ఉంటూ ఈ సమస్యకు చికిత్స తీసుకుంటున్న సామ్.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. సినిమా అప్డేట్స్ షేర్ చేస్తూ.. అభిమానులతో టచ్ లో ఉంటుంది. మయైసైటిస్ సమస్యతో బాధపడుతున్న సామ్.. ఇలాంటి పరిస్థితుల్లోనూ తేలికపాటి వర్కవుట్స్ చేస్తూ.. కోలుకోవడానికి పోరాటం చేస్తుంది. ఫిట్ నెస్ పరంగా ఆమె ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. గతంలోనూ సామ్ జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్న వీడియోస్ తెగ వైరలయ్యాయి. అయితే కేవలం వర్కవుట్స్ మాత్రమే కాదు..మనం తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యమంటుంది సమంత. గతంలో తన ఇంట్లోని గార్డెన్ ఏరియాలో వర్కవుట్స్ చేస్తున్న వీడియో షేర్ చేస్తూ తాను తీసుకునేఫుడ్ గురించి చెప్పుకొచ్చింది. 2020 నవంబర్ లో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది.
ఆ వీడియోలో సామ్ గార్డెన్ ఏరియాలో ఎంతో ఉత్సాహంగా వ్యాయమాలు చేస్తూ కనిపించింది. “ప్రతిచోటా అన్ని జీవులు సంతోషంగా.. స్వేచ్చగా ఉండనివ్వాలి. నా జీవితంలోని ఆలోచనలు.. మాటలు.. చర్యలు ఏదో ఒక విధంగా ఆనందానికి ఉండేందుకు.. అందరికీ ఆ స్వేచ్చకు దోహదం చేస్తాయి. #day2ofplantbasedtransformation. మీ పనితీరుని మెరుగుపరుచుకోలేరనే అపోహను వదిలిపెట్టండి. ఆకు కూరలతో చేసే వంటకాలు కండరాలు బలంగా ఉండేందుకు సహయపడతాయి” అంటూ రాసుకొచ్చింది. సామ్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతుంది.




ఇదిలా ఉంటే.. ఇటీవలే యశోధ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది సామ్. లేడీ ఓరియెంటెడ్ గా వచ్చిన ఈ మూవీలో సామ్ గర్భవతి మహిళగా కనిపించింది. అంతేకాకుండా యాక్షన్ సన్నివేశాల్లోనూ అదరగొట్టింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటిస్తోంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




