Pawan Kalyan: బాలకృష్ణతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ 2 ఎపిసోడ్ పై కీలక అప్డేట్..
ఇప్పటికే బాలయ్యతో కలిసి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సందడి చేసిన సంగతి తెలిసిందే. డార్లింగ్ కు సంబంధించిన ఫ్రోమో యూట్యూబ్ ను షేక్ చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ఎపిసోడ్ డిసెంబర్ 30న స్ట్రీమింగ్ కానుంది.
నందమూరి నటసింహం బాలకృష్ణ అన్ స్టాపబుల్ అంటూ సినీప్రియులను అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ మాధ్యమం ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోలో యాంకరింగ్‌కు కొత్తదనం తీసుకువచ్చారు బాలయ్య. సరదాగా ఆట పట్టిస్తూనే ప్రేక్షకులను కావాల్సిన సమాధానాలను అతిథుల నుంచి రాబడుతున్నారు. ఈ షోకు ఆడియన్స్ నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఆడియన్స్ కోరుకుంటున్నట్లుగానే వారి అభిమాన తారలను తీసుకువస్తూ అన్ స్టాపబుల్ ఎంటర్టైన్మెట్ అందిస్తున్నారు మేకర్స్. ఇక ఇప్పటికే బాలయ్యతో కలిసి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సందడి చేసిన సంగతి తెలిసిందే. డార్లింగ్ కు సంబంధించిన ఫ్రోమో యూట్యూబ్ ను షేక్ చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ఎపిసోడ్ డిసెంబర్ 30న స్ట్రీమింగ్ కానుంది. ఇకఈ షోకు గురించి మరో క్రేజీ న్యూస్ వైరలవుతున్న సంగతి తెలిసిందే. అదే నందమూరి నటసింహంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. బాలయ్యతో కలిసి ఈ షోలో పవన్ సందడి చేయనున్నారని ఎప్పటినుంచో టాక్ వినిపిస్తోంది. తన స్నేహితుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి పవన్ బాలయ్య షోలో పాల్గొననున్నారని టాక్.
తాజాగా వీరిద్దరి ఎపిసోడ్ గురించి మరో కీలక అప్డేట్ వినిపిస్తోంది. అదెంటంటే.. ఈ సీజన్ ముగింపు ఎపిసోడ్ పోస్టర్ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 27న అన్నపూర్ణ మెయిన్ స్టూడియోలో జరనగున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నారట. అంతేకాకుండా.. ఈ సీజన్‌కు పవన్ ఎపిసోడ్ చివరిదని తెలుస్తోంది. ఇక త్వరలోనే వీరిద్దరికి సంబంధించిన ఎపిసోడ్ షూట్ జరగనున్నట్లుగా టాక్. మరీ చూడాలి… బాలయ్య.. పవన్ మధ్య ఎలాంటి ప్రశ్నలు రాబోతున్నాయో.
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. మరోవైపు బాలయ్య, శ్రుతి హాసన్ జంటగా నటిస్తోన్న వీర సింహా రెడ్డి సంక్రాంతి కానుకగా రాబోతుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.