Unstoppable With NBK 2: డబుల్ ధమాకా.. బాలయ్య- పవన్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ షూటింగ్ ప్రారంభం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. బాలయ్యతో కలిసి ఈ షోలో పవన్ సందడి చేయనున్నారని ఎప్పటినుంచో టాక్ వినిపిస్తోంది.ఇప్పటివరకు ఒక లెక్కా..ఇక ఇప్పటినుంచి ఒక లెక్క అనేలా పవన్ కల్యాణ్ షోను ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ మోస్ట్ అవైటెడ్ ఎపిసోడ్ షూటింగ్ ప్రారంభమైంది.
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న అన్ స్టాపబుల్ టాక్ షో ఊహించిని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఛాట్ షోకు ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు వచ్చారు. బాలయ్యతో తమ జీవిత విశేషాలను పంచుకున్నారు. కాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. బాలయ్యతో కలిసి ఈ షోలో పవన్ సందడి చేయనున్నారని ఎప్పటినుంచో టాక్ వినిపిస్తోంది.ఇప్పటివరకు ఒక లెక్కా..ఇక ఇప్పటినుంచి ఒక లెక్క అనేలా పవన్ కల్యాణ్ షోను ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ మోస్ట్ అవైటెడ్ ఎపిసోడ్ షూటింగ్ ప్రారంభమైంది. కాగా పవన్ కళ్యాణ్ తో జరిగే ఈ ఎపిసోడ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అటు నందమూరి, ఇటు మెగాస్టార్ ఫ్యా్స్ వేయికళ్లతో ఈ ఎపిసోడ్ కోసం వేచిచూస్తున్నారు.
కాగా ఈ ఎపిసోడ్‌లో పవన్‌తో కలిసి డైరెక్టర్ క్రిష్ హాజరు కానున్నట్లు తెలుస్తుంది. త్రివిక్రమ్ రాకపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. కాగా టాలీవుడ్‌లో మాస్ ఫాలోయింగ్‌లో ఉన్న ఈ ఇద్దరు హీరోలు ఏం మాట్లాడుకుంటారు? షోలో బాలయ్య పవన్‌ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు? ఇద్దరూ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు కాబట్టి రాజకీయ అంశాలు చర్చకు వస్తాయా? అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది. అలాగే బాలయ్య.. పవన్ కల్యాన్ మల్టీ స్టారర్ సినిమా పై కూడా ప్రశ్నలు సంధించే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..