Nara Rohith: నారా రోహిత్- సిరిలేళ్ల పెళ్లి ముహూర్తం ఫిక్స్.. ఐదు రోజుల పాటు వేడుకలు.. వేదిక ఎక్కడో తెలుసా?
టాలీవుడ్ హీరో నారా రోహిత్ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ప్రతినిధి 2 సినిమా హీరోయిన్ సిరి లేళ్లతో కలిసి పెళ్లిపీటలెక్కేందుకు సమయం ఖరారైంది. మొత్తం నాలుగు రోజుల పాటు ఈ పెళ్లి వేడుకలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

టాలీవుడ్ హీరో, హీరోయిన్లు నారా రోహిత్, సిరిలేళ్ల పెళ్లి ముహూర్తం దాదాపు ఖరారైంది. ఇప్పటికే ఇరు కుటుంబాల్లో పెళ్లి పనులు కూడా మొదలయ్యాయి. సిరిలేళ్ల పసుపు దంచి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుగుతున్నా పెళ్లి ముహూర్తం ఎప్పుడు, పెళ్లి వేదిక ఎక్కడని తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నారా రోహిత్-సిరిల పెళ్లి వివరాలకు సంబంధించి అప్డేట్ వచ్చింది. నారా రోహిత్-సిరిల వివాహ వేడుకలు హైదరాబాద్‌లో ఐదు రోజులపాటు భారీగా అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నెల అక్టోబర్ 25న హల్దీ వేడుకతో పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 26న నారా రోహిత్ పెళ్లి కొడుకుగా ముస్తాబు కానున్నాడు. అక్టోబర్ 28న మెహందీ, అక్టోబర్ 29న సంగీత్ నైట్ నిర్వహించనున్నారు. ఇక అక్టోబర్ 30న రాత్రి 10:35 గంటలకు సిరి మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు నారా రోహిత్. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారని సమాచారం. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయని సమాచారం.
నారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి 2 సినిమాలో హీరోయిన్ గా నటించింది సిరి లేళ్ల. అప్పటి నుంచే వీరి మధ్య ప్రేమ మొదలైంది. పెద్దల అనుమతితో గతేడాది అక్టోబర్ లో నిశ్చితార్థం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బాలకృష్ణతో పాటు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు నారా రోహిత్ ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరయ్యారు. ఇప్పుడు పెళ్లితో తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రెడీ అయ్యారు నారా రోహిత్- సిరి.
హైదరాబాద్ లో నారా రోహిత్- సిరిల పెళ్లి వేడుకలు..
Two hearts. One destiny. Infinite memories ahead ❤️
The beautiful journey of #NaraRohith & Sireesha begins with a celebration as grand as their love story 💍
A 4-Day grand wedding festivities to be held in Hyderabad with the Muhurtham on 30-10-25 ❤️
Here’s to forever filled… pic.twitter.com/AqGedliw78
— Ramesh Bala (@rameshlaus) October 22, 2025
పసుపు దంచే కార్యక్రమంలో సిరి లేళ్ల..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








