AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: పుష్ప 2 సినిమాపై రాయలసీమ వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన ట్వీట్.. రిప్లై ఇచ్చిన అల్లు అర్జున్

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ది మోస్ట్ అవైటేడ్ సినిమా పుష్ఫ 2 : ది రూల్. మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప.. ది రైజ్ సినిమాకు కు ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన సుకుమార్ రెండో పార్ట్ ను కూడా తెరకెక్కించాడు. మరో రెండు వారాల్లో ఈ క్రేజీ సీక్వెల్ రిలీజ్ కానుంది.

Pushpa 2: పుష్ప 2 సినిమాపై రాయలసీమ వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన ట్వీట్.. రిప్లై ఇచ్చిన అల్లు అర్జున్
Silpa Ravi, Allu Arjun
J Y Nagi Reddy
| Edited By: Basha Shek|

Updated on: Nov 21, 2024 | 3:08 PM

Share

టాలీవుడ్ అగ్ర నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు, నంద్యాల వైసీపీ మాజీ ఎమ్మెల్యే కు మధ్య ఫ్రెండ్షిప్ బంధం మరింత బలపడుతోంది. ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్ విషెస్ చెప్పారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే.”తెరపై మీ విశ్వరూపం చూడటానికి ఎదురుచూస్తున్నాం బ్రదర్ అంటూ నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ట్వీట్ చేశారు. దీనికి అల్లు అర్జున్ కూడా స్పందిస్తూ థాంక్స్ బ్రదర్ మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రతి ట్వీట్ లతో నంద్యాలలోనే కాకుండా సీమ జిల్లాల్లో చర్చ నడుస్తుంది. కాగా అల్లు అర్జున్, శిల్పా రవి మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల సందర్భంగా కూడా వీరిద్దరి స్నేహబంధం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా వేల మంది ర్యాలీతో శిల్ప రవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఇదే విషయమై అర్జున్ పై కేసు నమోదవుగా కోర్టులో ఇటీవలే క్వాష్ అయింది. తాజాగా అల్లు అర్జున్ పుష్ఫ 2 సినిమాకు శిల్పా రవి అడ్వాన్స్ విషెస్ తెలియ జేయడం, ఇది చూసిన బన్నీ వెంటనే రిప్లై ఇవ్వడంతో సీమ జిల్లాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన పుష్ప-2 రిలీజ్ కు మరో రెండు వారాల సమయమే ఉంది. సుకుమార్ తెరకెక్కించిన ఈ క్రేజీ సీక్వెల్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇటీవల ట్రైలర్‌ రిలీజ్ కాగా.. యూట్యూబ్‌ షేక్ అవుతోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే అత్యంత వేగంగా 40 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఇంతవరకు భారతీయ సినిమా చరిత్రలోనే ఏ మూవీ కూడా ఇలాంటి రికార్డ్ సాధించలేదు.

ఇవి కూడా చదవండి

వైసీపీ నేత శిల్పా రవి ట్వీట్..

ఎన్నికలకు ముందు నంద్యాల పర్యటనలో అల్లు అర్జున్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.