అతనికి కార్ డ్రైవింగ్ నేర్పించింది నేనే.. ఎన్టీఆర్ మనవడిని అనే బిల్డప్ లేదు : నందమూరి చైతన్య కృష్ణ
నందమూరి చైతన్య కృష్ణ.. చాలా కాలం తర్వాత ఆమధ్య ‘బ్రీత్’ సినిమాతో థియేటర్లలో సందడి చేశారు. అయితే ఈ సినిమాకు మినిమమ్ కలెక్షన్లు కూడా రాలేదు. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ. సినిమాలపై ప్రేమతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చైతన్య కృష్ణ.. 2003లో జగపతిబాబు హీరోగా వచ్చిన ‘ధమ్’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు.

నందమూరి చైతన్య కృష్ణ.. గతంలో ఓ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన ఈ నటుడు.. మొన్నామధ్య ఓ సినిమాలో హీరోగా కనిపించాడు. తన తొలి చిత్రం బ్రీత్ ద్వారా హీరోగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేదు. ఆతర్వాత ఆయన మరో సినిమా చేయలేదు. కాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటున్నారు చైతన్య కృష్ణ.. అలాగే గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఇంటర్వ్యూలో ఆయన అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. దివంగత నందమూరి తారకరత్నతో తన అనుబంధం గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి అనేక విషయాలను పంచుకున్నారు. తారకరత్న ఆకస్మిక మరణం తమ కుటుంబ సభ్యులందరికీ ఊహించని పరిణామం అని, ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోయామని చైతన్య కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పాట వింటే కన్నీళ్లు ఆగవు.. సాంగ్ వచ్చి 31 ఏళ్లు.. ఇప్పటికీ అదే ఫీల్
తారకరత్న చాలా నిరాడంబరమైన వ్యక్తి అని, అహంకారం, గర్వం లేని మనిషి అని చైతన్య కృష్ణ వర్ణించారు. ఎన్టీ రామారావు మనవడిని అనే బిల్డప్‌లు ఎప్పుడూ ఇవ్వలేదని, తన తాతగారి పేరును దుర్వినియోగం చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. తారకరత్నకు మొదట డ్రైవింగ్ నేర్పింది తానేనని, అప్పటి మారుతి 800 కారులో డ్రైవింగ్ నేర్పినట్లు గుర్తు చేసుకున్నారు. మాసబ్ ట్యాంక్‌లోని తమ ఇళ్లు పక్కపక్కనే ఉండేవని, తారకరత్న తరచుగా వచ్చి అన్నయ్య, అన్నయ్య అని పిలిచేవాడని తెలిపారు చైతన్య..
ఆ హీరో ఉత్త అమాయకుడు, మంచివాడు.. ఏది చెప్పిన చేసేవాడు.. ఆసక్తికర విషయం చెప్పిన తేజ
ప్రతి ఆదివారం కళ్యాణ్ రామ్, మోహన కృష్ణ, తమ్మల ప్రసాద్, మోహన్ బాబు, అలాగే ఇద్దరు ముస్లిం స్నేహితులు హుస్సేన్, ఆదిల్‌తో కలిసి క్రికెట్ ఆడేవారని చైతన్య కృష్ణ తెలిపారు. తారకరత్న మంచి ఫాస్ట్ బౌలర్ అని, అలాగే బ్యాట్స్‌మెన్ కూడా అని పేర్కొన్నారు. తాతగారు ఎన్టీఆర్‌తో తారకరత్న దిగిన ఒకే ఒక ఫోటోను తాను దగ్గరుండి తీయించానని, అది ఎన్టీఆర్ మరణానికి సరిగ్గా 15 రోజుల ముందు 1996 జనవరి 1న జరిగిందని చైతన్య కృష్ణ గుర్తుచేసుకున్నారు. తాతగారి ఇంటికి వెళ్లినప్పుడు, ఫోటోగ్రాఫర్ ఇతర ప్రముఖులతో ఫోటోలు తీస్తున్న సమయంలో, తారకరత్న కూడా తాతగారితో ఫోటో దిగితే బాగుంటుందని తనే తీసుకెళ్లి దిగించానని ఆయన అన్నారు. ఆ ఫోటోనే ఇప్పుడు అందరూ చూస్తున్న తారకరత్న చివరి ఫోటో అని ఆయన అన్నారు ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
200లకు పైగా సినిమాలు.. కనీసం చివరి చూపుకు కూడా సినిమావాళ్లు రాలేదు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




