AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతను నాకు గురువు.. ఎలా ప్రపోజ్ చేస్తా..! పిచ్చి పిచ్చి రూమర్స్ వల్ల చాలా బాధపడ్డా: అక్సా ఖాన్

టీవీ షోలతో పాపులర్ అయిన వారిలో అక్సా ఖాన్ ఒకరు. ఈ అమ్మడు తన డాన్స్ తో ప్రేక్షకులను విశేషంగా కట్టుకుంది ఈ చిన్నది. అక్సా ఖాన్ తన డాన్స్ తో ఎంతో మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. అలాగే తన అందంతోనూ ఆకట్టుకుంటుంది. అలాగే పలు సినిమాల్లోనూ పని చేస్తుంది.

అతను నాకు గురువు.. ఎలా ప్రపోజ్ చేస్తా..! పిచ్చి పిచ్చి రూమర్స్ వల్ల చాలా బాధపడ్డా: అక్సా ఖాన్
Aqsa Khan
Rajeev Rayala
|

Updated on: Jan 19, 2026 | 7:56 PM

Share

ఢీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో అక్సా ఖాన్ ఒకరు. తన డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అందాల తార. డాన్స్ తో పాటు పలు టీవీ షోల్లోనూ పాల్గొంది, అలాగే సినిమాల్లోనూ చేస్తూ ఆకట్టుకుంది అక్సా ఖాన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితంపై వస్తున్న పలు రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది అక్సా ఖాన్. బిగ్ బాస్ షో గురించి ప్రస్తావించగా.. ప్రతి సంవత్సరం బిగ్ బాస్ టీమ్ తనను అప్రోచ్ అవుతుందని అక్సా ఖాన్ తెలిపింది. అయితే, ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమా ప్రాజెక్టుల కారణంగా షోలో పాల్గొనలేకపోతున్నానని ఆమె తెలిపింది. బిగ్ బాస్ ఒక మంచి ప్లాట్‌ఫామ్ అయినప్పటికీ, తాను సున్నితమైన వ్యక్తిత్వం కలిగిన దానిని కాబట్టి షోకు సెట్ అవ్వనని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అయినప్పటికీ, భవిష్యత్తులో ఛాన్స్ వస్తే ప్రయత్నించాలని ఉందని ఆమె చెప్పుకొచ్చింది.

బిగ్ బాస్ అప్డేట్స్ వచ్చే వీడియోలలో తన పేరు తరచుగా వినిపిస్తుంటుందని, తన అభిమానులు కూడా బిగ్ బాస్‌కు వెళ్లమని కోరుతుంటారని ఆమె తెలిపారు. ఢీ షోలో తాను రెమ్యూనరేషన్ తీసుకోలేదని, కేవలం ఫేమ్ కోసం మాత్రమే కష్టపడ్డానని స్పష్టం చేసింది అక్సా ఖాన్. మాస్టర్లకు మాత్రమే పారితోషికం లభించేదని, దుస్తులు, ఆహారం వంటి ఖర్చులన్నీ మాస్టర్లకే ఇచ్చేవారని అక్సా ఖాన్ తెలిపింది. ఢీ షో ద్వారానే తనకు మంచి గుర్తింపు, స్టార్‌డమ్ లభించాయని, అందుకే తెలుగు ఇండస్ట్రీలోనే ఉండి మంచి మంచి ప్రాజెక్టులు చేయాలనుకుంటున్నానని ఆమె తెలిపింది. ఇక్కడే తన స్థానాన్ని పదిలం చేసుకుంటానని చెప్పుకొచ్చింది.

ప్రమోషన్స్ కోసం ప్రస్తుతం తాను మంచి పారితోషికం తీసుకుంటున్నట్లు అక్సా ఖాన్ తెలిపింది. ఢీ నుంచి వచ్చిన ఎవరితోనూ టచ్‌లో లేనని అక్సా ఖాన్ స్పష్టం చేశారు. తాను ఎక్కువగా స్నేహపూర్వకంగా ఉండనని, తనకంటూ ఒక ప్రత్యేకమైన జోనర్ అలవాటు అని తెలిపింది. ఒక పెద్ద సర్కిల్ లేకపోతే కెరీర్ నెమ్మదిస్తుందని తాను నమ్మడం లేదని, తాను వర్క్ హాలిక్ లాంటి వ్యక్తి అని, ఇతర విషయాలపై పెద్దగా ఆసక్తి ఉండదని తెలిపింది. తన వివాహం గురించి బయట ప్రచారం జరుగుతోందని, అయితే అది అవాస్తవమని, ఒకవేళ పెళ్లి జరిగితే సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడిస్తానని ఆమె స్పష్టం చేశారు. అలాగే, సుడిగాలి సుధీర్‌కు తాను పెళ్లి ప్రపోజ్ చేశాననే రూమర్‌ను ఆమె తీవ్రంగా ఖండించారు. సుధీర్ సార్ తనకు మెంటర్, గురువుతో సమానమని, ఆయన పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. తాను ఒక స్టూడెంట్‌గా ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని, అలాంటి గురువుకు ఎలా ప్రపోజ్ చేస్తానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ రూమర్స్ వల్ల తాను చాలా బాధపడ్డానని, ఇదంతా ఎవరు క్రియేట్ చేశారో తెలియదని అన్నారు. రిలేషన్‌షిప్ రూమర్స్ గురించి మాట్లాడగా, తాను ఇంకా సింగిల్‌నని అక్సా ఖాన్ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..