AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్పెషల్ సాంగ్స్ చేయడానికి రెడీ.. కానీ ఆ నాలుగురితోనే అంటున్న పాన్ ఇండియా హీరోయిన్

చాలా మంది అందాల భామలు హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. చాలా మంది అందాల భామలు తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంటున్నారు. కొంతమంది అందాల భామలు ఓవర్ నైట్ లోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంటున్నారు. ఇక హీరోయిన్ ఎలాంటి పాత్రల్లో నటించడానికైనా సిద్ధమవుతున్నారు.

స్పెషల్ సాంగ్స్ చేయడానికి రెడీ.. కానీ ఆ నాలుగురితోనే అంటున్న పాన్ ఇండియా హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: Jan 20, 2026 | 6:43 PM

Share

రాను రాను హీరోయిన్స్ క్రేజ్ మరింత పెరుగుతుంది. ఇప్పుడు హీరోలకు సమానంగా కొందరు హీరోయిన్స్ సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. అలాగే మరికొంతమంది రెమ్యునరేషన్స్ కూడా అందుకుంటున్నారు. అలాగే కొత్త కొత్త ముద్దుగుమ్మలు పరిచయం అవుతూ తమ అందచందాలతో కవ్విస్తున్నారు. కొంతమంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోనూ స్టెప్పులేస్తూ అదరగొడుతున్నారు. సమంత, తమన్నా, శ్రీలీల ఇలా చాలా మంది ముద్దుగుమ్మలు స్పెషల్ సాంగ్స్ లో అదరగొడుతున్నారు. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కూడా స్పెషల్ సాంగ్ చేయడానికి రెడీ అయ్యింది. కానీ కొన్ని కండిషన్స్ పెట్టింది.  ఓ నలుగురు డైరెక్టర్స్ పేర్లు చెప్పి.. ఆ నలుగురు అడిగితే స్పెషల్ సాంగ్ చేస్తా అని చెప్పింది. ఇంతకూ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు.? ఆమె చెప్పిన దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం.!

200లకు పైగా సినిమాలు.. కనీసం చివరి చూపుకు కూడా సినిమావాళ్లు రాలేదు

తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది స్టార్ బ్యూటీ రష్మిక మందన్న. 9 ఏళ్ల కెరీర్ లో నాలుగు భాషల్లో మొత్తం 25 మూవీస్ లో నటించింది రష్మిక మందన్న. ఈ సినిమాల్లో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ తో పాటు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన సినిమాలు ఎన్నో ఉండటం విశేషం. పాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాలు సాధిస్తూ తన స్టార్ డమ్ క్రేజ్ చూపిస్తోంది రష్మిక. అందం, నటన, ఆకర్షణతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. మరో హీరోయిన్ కు లేనంత క్రేజ్ ను సొంతం చేసుకుంటోంది రష్మిక. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. మొన్నామధ్య రష్మిక గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఇవి కూడా చదవండి

ఆ హీరో ఉత్త అమాయకుడు, మంచివాడు.. ఏది చెప్పిన చేసేవాడు.. ఆసక్తికర విషయం చెప్పిన తేజ

ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతుంది ఈ సినిమా. కాగా రష్మిక స్పెషల్ సాంగ్ చేయడం పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. మొన్నామధ్య నటుడు జగపతి బాబు టాక్ షోకు రష్మిక హాజరయ్యింది. ఈ ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకుంది. తనకు విభిన్నమైన పాత్రలు చేయడం అంటే ఇష్టమని చెప్పింది. అలాగే కథ నచ్చితే నెగిటివ్ రోల్స్ లోనూ చేస్తాను అని తెలిపింది. అలాగే తన మైండ్ లో నలుగురు దర్శకులు ఉన్నారని, వాళ్లు అడిగితే మాత్రమే స్పెషల్ సాంగ్స్ చేస్తానని తెలిపింది. ఆ నలుగురు తప్పితే ఎవరు అడిగినా ప్రత్యేక గీతాల్లో నటించనని చెప్పింది.. ఆ నలుగురు ఎవరు అనేది మాత్రం రష్మిక చెప్పలేదు. అలాగే స్పెషల్ సాంగ్ అనేది తాను హీరోయిన్ గా చేస్తున్న సినిమాలోనే స్పెషల్ సాంగ్ చేస్తా అని తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఈ పాట వింటే కన్నీళ్లు ఆగవు.. సాంగ్ వచ్చి 31 ఏళ్లు.. ఇప్పటికీ అదే ఫీల్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..