ఆ హీరో ఉత్త అమాయకుడు, మంచివాడు.. ఏది చెప్పిన చేసేవాడు.. ఆసక్తికర విషయం చెప్పిన తేజ
చిత్రం, నువ్వునేను, జయం, సంబరం, జై, ధైర్యం, ఔనన్నా కాదన్నా.. ఇలా ఎన్నో ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించారు డైరెక్టర్ తేజ. అంతేకాదు తన సినిమాల ద్వారా ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్, కాజల్ అగర్వాల్, ప్రిన్స్, నందిత వంటి స్టార్ హీరోలు, హీరోయిన్లను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే గత కొన్నేళ్లుగా తేజకు సరైన సినిమాలు పడడం లేదు.

దర్శకుడు తేజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించారు. గతంలో తేజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమా ఇండస్ట్రీ శాశ్వతమని, వ్యక్తులు వస్తుంటారు పోతుంటారని ఆయన తేజ అన్నారు. ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు, సావిత్రి వంటి సినీ దిగ్గజాలు లేకపోయినా పరిశ్రమ నిలబడిందని, ముందుకు సాగిందని అన్నారు తేజ. పరిశ్రమ తరపున ఏ మీటింగ్ జరిగినా చిరంజీవి, బాలకృష్ణ వంటి పెద్దలందరినీ పిలవాలని, ఈగోలు పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని తేజ అన్నారు. ఒక కుటుంబంలా కలిసి ఉండాలని, ఎవరూ తక్కువ కాదు, ఎవరూ ఎక్కువ కాదని ఆయన అన్నారు.
తేజ దర్శకుడిగా పరిచయం అయిన చిత్రం సినిమా ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. మొదట వేరే హీరో అనుకున్నా, చివరికి ఉదయ్ కిరణ్ హీరోగా ఖరారయ్యాడని తెలిపారు. ఉదయ్ కిరణ్ అమాయకుడు, మంచివాడని, ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండేవాడని పేర్కొన్నారు. 30 రోజుల్లో సినిమా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, సరిగ్గా 31 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశామని తెలిపారు. అప్పటి హీరోలు చిరంజీవి, బాలకృష్ణ వంటివారు సమయపాలన పాటించి, డెడికేషన్‌తో పనిచేసేవారని, అందుకే సినిమాలు తక్కువ సమయంలో పూర్తి అయ్యేవని, ఆధునికత పేరుతో ఆలస్యం చేసేవారిని తేజ అన్నారు. అలాగే నువ్వు నేను సినిమా విషయానికి వస్తే, ముందుగా మాధవన్‌ను అనుకున్నా, అతను తెలుగు సినిమాలు చేయనని చెప్పడంతో ఉదయ్ కిరణ్‌ను హీరోగా తీసుకున్నట్లు తేజ తెలిపారు. అలాగే తన సినిమాలు, పాటలు ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషలో ఉండాలని తేజ అన్నారు.
చెన్నైలో పెరిగినందున తనకు తెలుగులో పెద్ద పెద్ద పదాలు రావని, అందుకే తన సినిమాల్లో సాధారణ, తెలుగు పదాలు ఎక్కువగా ఉంటాయని, ఇంగ్లీష్ తక్కువగా ఉంటుందని వివరించారు. తన ప్రేక్షకులు రిక్షా కార్మికులు, ఆటో డ్రైవర్లు, యువత, మధ్యతరగతి ప్రజలేనని, వారికి అర్థమయ్యే భాషలో సినిమాలు తీయడమే తన లక్ష్యమని తేజ పేర్కొన్నారు. రామ్ గోపాల్ వర్మ వద్ద సహాయ దర్శకుడిగా సినీ ప్రస్థానం మొదలుపెట్టి శివ, క్షణక్షణం వంటి చిత్రాలకు పనిచేశాని, ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మనే తనను కెమెరామెన్‌గా మార్చారని తేజ తెలిపారు. రాత్రి, అంతం, మనీ, రక్షణ, తీర్పు వంటి తెలుగు చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేశాక ముంబై వెళ్లిపోయారని, అక్కడ హిందీ సినిమాలకు కథలు అందించానని, ఆ తర్వాత దర్శకుడిగా మారి చిత్రం చిత్రంతో స్వయంగా నిర్మాతగా మారి జయం, నిజం వంటి విజవంతమైన చిత్రాలను నిర్మించాని తేజ తన కెరీర్ ప్రస్థానాన్ని వివరించారు. చిత్రం సినిమాకు తాను రూ. 11,000 మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నానని, అది హీరోతో సహా అందరికీ సమానంగా ఇచ్చామని గుర్తుచేసుకున్నారు తేజ.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




