ఆ డైరెక్టర్ నా ఫోటోస్ జూమ్ చేసి మరీ చూశాడు.. టాలీవుడ్ హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
20 January 2026
అచ్చ తెలుగమ్మాయి ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 12 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటున్నప్పటికీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు.
ఇప్పుడు సరైన బ్రేక్ కోసం చూస్తుంది. అందం, అభినయం ఉన్నా ఈ బ్యూటీకి అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ప్రస్తుతం ఓం శాంతి శాంతి సినిమా చేస్తుంది.
ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
కాలేజీ పూర్తి కాగానే తాను మోడలింగ్ రంగంలోకి వచ్చానని అన్నారు. ఆడిషన్స్ సమయంలో ఎంతో టెన్షన్ పడ్డానని అన్నారు. అలాగే ఎన్నో కామెంట్స్ వచ్చాయట.
ప్రతి విషయాన్ని తాను చాలా కాన్ఫిడెంట్ గా చెప్పానని అన్నారు. డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ తన ఫోటోస్ ఫేక్ బుక్ లో చూసి హిందీ అమ్మాయి అనుకున్నారట.
ముంబైలో ఫోటోషూట్ చేయించడం వల్ల అలా కనిపించానని అన్నారు. వెంటనే తనకు మోహనకృష్ణ ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందని.. సినిమాకు సెలక్ట్ చేశారని అన్నారు.
కెరీర్ విషయంలో అమ్మ తనకు చాలా సపోర్ట్ చేసిందని.. దర్శకుడు అనే సినిమా సమయంలో తన తల్లి చనిపోయిందని.. 11 రోజుల తర్వాత షూటింగ్ కు వెళ్లిందట.
ఒక అవార్డ్ షోలో నన్ను ఈషా గుప్తా అని పిలవడంతో షాక్ అయ్యా అని.. దీంతో వెంటనే తన పేరును ఈషా రెబ్బా అని మార్చుకున్నానని చెప్పుకొచ్చింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్