OTT Movie: ‘ధురంధర్’కు మించి కలెక్షన్లు.. ఇప్పుడు ఓటీటీలోకి రియల్ క్రైమ్ స్టోరీ.. IMDBలోనూ టాప్ రేటింగ్ మూవీ
ఆ మధ్యన తెలుగులో వచ్చిన బలగం సినిమా గుర్తుందా? థియేటర్లలో ఈ సినిమాను చూసి జనాలు బాగా ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా థియేటర్ల దగ్గర కూడా సేమ్ టు సేమ్ అలాంటి సీన్లే కనిపించాయి.

ఈ మధ్యన నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకక్కుతున్నాయి. ఆడియెన్స్ కూడా వీటిని చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీలో రియల్ స్టోరీలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక రియల్ స్టోరీనే. ఇదొక క్రైమ్ డ్రామా. కానీ థియేటర్లలో ఆడియెన్స్ తో కన్నీళ్లు పెట్టించింది. ఆ మధ్యన తెలుగులో వచ్చిన బలగం సినిమా లాగే ఈ మూవీని చూసి ఆడియెన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఏకంగా 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించి నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చి పెట్టింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ‘కదిరవన్’ అనే హెడ్ కానిస్టేబుల్ పాత్ర చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. అబ్దుల్ రౌఫ్ అనే విచారణా ఖైదీని జైలు నుండి శివగంగ కోర్టుకు తరలించే క్రమంలో జరిగే ప్రయాణమే ఈ సినిమా కథ. అసలు ఈ అబ్దుల్ ఎవరు ? ఆ హత్య కేసు ఏమిటి ? కదిరవన్ పాత్ర ఇందులో ఎలాంటి మలుపులు తెస్తుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే ఈ క్రైమ్ డ్రామా సినిమాను చూడాల్సిందే.
కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్, ఇటీవలే ఘాటీ సినిమాలో కనిపించిన విక్రమ్ ప్రభు నటించిన ఈ సినిమా పేరు సిరై. క్రిస్మస్ కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పోలీస్ దర్యాప్తు, ఖైదీల విచారణ నేపథ్యంలో ఎమోషనల్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. కులం, మతం ఆధారంగా మైనారిటీలను మన సమాజం, న్యాయవ్యవస్థ ఎలా చూస్తుందనే విషయాన్ని ఈ మూవీలో చూపించారు.సెవెన్ స్క్రీన్ స్టూడియో ఆధ్వర్యంలో ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో ఎల్‌కే అక్షయ్ కుమార్, అనిష్మా అనిల్‌కుమార్, అనంత తంబిరాజా కీలక పాత్రలు పోషించారు. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న సిరై మూవీ జనవరి 23 నుంచి జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదలైంది.
జీ 5లో స్ట్రీమింగ్..
A powerful journey of justice and humanity begins❤️🔥
Experience the thrill of #Sirai on Jan 23rd On ZEE5🔒@iamVikramPrabhu @lk_akshaykumar @iamanishma @anandasayani @7screenstudio @madheshmanickam @justin_tunes @philoedit @directortamil77 @SRIMAN161725 @varshu03 @PC_stunts… pic.twitter.com/NnDmQyBE1B
— ZEE5 Tamil (@ZEE5Tamil) January 16, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




