OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన ఆది సాయికుమార్ లేటెస్ట్ సూపర్ హిట్.. ‘శంబాల’ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ నటించిన లేటేస్ట్ సినిమా శంబాల. గతేడాది డిసెంబర్ నెలలో థియేటర్లలో విడుదలైన ఈ డివోషినల్ మిస్టరీ థ్రిల్లర్ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ గత కొంతకాలంగా వరుస పరాజయాలతో సతమతమయ్యాడు. ఎన్ని ప్రయోగాలు చేసినా కమర్షియల్ సక్సెస్ మాత్రం అందని ద్రాక్షలాగే మారిపోయింది. అయతే ఎట్టకేలకు శంబాల సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడీ ట్యాలెంటెడ్ హీరో. గతేడాది డిసెంబర్ లో థియేటర్లలో రిలీజైన ఈ మిస్టికల్ థ్రిల్లర్ సూపర్ హిట్ గా నిలిచింది. సంప్రదాయ భక్తి భావనకు, సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను జోడించిన విధానం ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. అలాగే హీరోగా ఆది సాయికుమార్ పెర్ఫార్మెన్స్ సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి. అలాగే ప్రమోషన్లు కూడా పెద్ద ఎత్తున నిర్వహించడంతో శంబాల సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వచ్చాయి. థియేటర్లలో ఆడియెన్స్ ను మంచి థ్రిల్ అందించిన శంబాల సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం (జనవరి 21) నుంచే ఆది సాయి కుమార్ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అయితే ప్రస్తుతం శంబాల సినిమాను ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్లు మాత్రమే చూసే అవకాశం ఉంది. సాధారణ సబ్‌స్క్రైబర్లకు మాత్రం గురువారం (జనవరి 22)నుంచి ఈ సూపర్ హిట్ సినిమా అందుబాటులోకి రానుంది.
యుగంధర్ ముని తెరకెక్కించిన శంబాల సినిమాలో ఆది సాయికుమార్ సరసన అర్చన అయ్యర్ కథానాయికగా నటించింది. స్వసిక, మధునందన్, రవి వర్మ, రామరాజు, హర్ష వర్దన్, అన్నపూర్ణ, లక్ష్మణ్ మీసాల, ఇంద్రనీల్ వర్మ, ప్రవీణ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీ చరణ్ పాకాల స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అలాగే హారర్, మిస్టరీ థ్రిల్లర్ జానర్‌ను సినిమాలను ఇష్టపడేవారికి శంబాల ఓ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.
ఆహాలో స్ట్రీమింగ్.. ఇప్పటికి వారికి మాత్రమే..
When science meets the unexplainable, horror awakens.
Watch #AadiShambhala now only on #ahagoldhttps://t.co/TDYBdfI09D@iamaadisaikumar @tweets_archana @ugandharmuni pic.twitter.com/Ujzfv6P6Zn
— ahavideoin (@ahavideoIN) January 21, 2026
రేపటి నుంచి ఆహా యూజర్స్ అందరికీ..
A storm of faith. A wave of fire 💥#AadiShambhala Premieres 22nd Jan only on #aha (24hrs early access for aha gold users)@iamaadisaikumar @tweets_archana @ugandharmuni pic.twitter.com/beZdPypgju
— ahavideoin (@ahavideoIN) January 19, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




