Renu Desai: నాకెవ్వరూ లేరు.. ఆయనకు మాత్రమే నా బాధ చెప్పుకుంటా.. రేణు దేశాయ్ వీడియో వైరల్
టాలీవుడ్ ప్రముఖ నటి రేణూ దేశాయ్ గత రెండు రోజలుగా వార్తల్లో నిలుస్తున్నారు. వీధి కుక్కల రక్షణ గురించి సోమవారం ( జనవరి 19) ప్రెస్ మీట్ పెట్టిన ఆమె చాలా అగ్రెసివ్ గా మాట్లాడారు. అయితే ఈ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు రేణూ దేశాయ్.

సినిమాలకు దూరంగా ఉన్న రేణూ దేశాయ్ తన సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటున్నారు. ముఖ్యంగా మహిళలు, మూగ జీవాలకు సంబంధించి పలు మంచి కార్యక్రమాలు, క్యాంపెయిన్లు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల వీధి కుక్కలపై జరుగుతున్న దాడులపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం (జనవరి 19) ఇదే అంశంపై ప్రెస్ మీట్ పెట్టిన ఆమె చాలా అగ్రెసివ్ గా మాట్లాడారు. ఐదు కుక్కలు కరిస్తే మిగతా వాటన్నింటినీ చంపేస్తారా? అని మండిపడ్డారు. అయితే ఉన్నట్లుండి రేణూ దేశాయ్ ఇలా ప్రెస్ మీట్ పెట్టడంపై భిన్నాభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశంతోనే ఆమె ఇదంతా చేస్తుందనే కామెంట్స్ వినిపించాయి. అయితే తనకు రాజకీయాలు ఇష్టం లేదని, ఏ పార్టీలోకి వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆమె ఇన్ స్టా గ్రామ్ లో ఒక సంచలన పోస్ట్ పెట్టారు.
ఈ మేరకు కాశీలోని గంగ నదిలో బోటులో ఉన్న వీడియోని షేర్ చేసిన రేణూ దేశాయ్.. ‘నన్ను కాపాడడానికి అమ్మనాన్న, అన్నయ్య, భర్త.. ఎవరూ లేరు. ఈ విషయంలో నా తప్పు లేకపోయినా సరే ఎందరో నన్ను విమర్శిస్తున్నారు. మీరు చేసే కామెంట్స్‌పై తిరిగి నేను స్పందించను. నేను నమ్మే భగవంతుడి దగ్గర మాత్రమే నా బాధను చెప్పుకుంటాను. ఆయన నా ప్రార్థనలు వింటున్నాడనే నమ్మకం నాకు ఉంది. నేను ఎప్పటికప్పుడు కాశీకి ఎందుకు వెళ్తానో మీకు ఇప్పడు అర్థమైంటుంది’ అని రాసుకొచ్చారు రేణూ దేశాయ్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.
రేణూ దేశాయ్ షేర్ చేసిన వీడియో ఇదిగో..
View this post on Instagram
కాగా మరో పోస్టులో వీధి కుక్కల అంశంపై స్పందిస్తూ.. ‘నేను ఎప్పుడూ నా హక్కుల కోసం పోరాడలేదు. వీధి కుక్కల విషయంలో మాత్రం పోరాటం ఆపను. కొన్ని కుక్కలు చేసిన తప్పునకు వందలాది వాటిని చంపాలనే నిర్ణయం సరైనది కాదు. ఇది మీకు అర్థమయ్యేంతవరకు నేను పోరాడుతూనే ఉంటాను’ అని రాసుకొచ్చారు.
వీధి కుక్కల అంశంపై రేణూ దేశాయ్ మరో పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




