AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈసారి ఎందుకు దొరకడో చూద్దాం.! డిజాస్టర్ హీరో.. అట్టర్ ఫ్లాప్ హీరోయిన్‌తో అనిల్ సినిమా

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికే రూ 300 కోట్లకు చేరువైన ఈ సినిమా రూ. 350 కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది.

ఈసారి ఎందుకు దొరకడో చూద్దాం.! డిజాస్టర్ హీరో.. అట్టర్ ఫ్లాప్ హీరోయిన్‌తో అనిల్ సినిమా
Anil Ravipudi
Rajeev Rayala
|

Updated on: Jan 20, 2026 | 7:22 PM

Share

అనిల్ రావిపూడి.. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు ఈ యంగ్ డైరెక్టర్.. ప్రతి సంక్రాంతికి ఓ సినిమా దింపుతున్నాడు. వచ్చిన ప్రతిసారి విజయాన్ని అందుకుంటూ దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుడిగా రాణిస్తున్న అనిల్ రావిపూడి ఇటీవల చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. గత ఏడాది వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి. ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అనిల్. ఈ సినిమా విజయంతో అనిల్ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఈ పాట వింటే కన్నీళ్లు ఆగవు.. సాంగ్ వచ్చి 31 ఏళ్లు.. ఇప్పటికీ అదే ఫీల్

మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఇప్పటికే కలెక్షన్స్ కుమ్మేస్తుంది. రూ. 300కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డులు  క్రియేట్ చేస్తుంది. ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా ఈ సినిమా దూసుకుపోతుంది. అయితే అనిల్ ఎప్పుడు ఎప్పుడు దొరుకుతాడా.?. ఒక్క ఫ్లాప్ అయినా పడకుండా ఉంటుందా అని కొందరు ఎదురుచూస్తున్నారు. దీని మీద కొంతమంది సరదాగా కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈసారి దొరుకుతాడు అనుకున్నాం.. కానీ మిస్ అయ్యాడు అంటూ ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు.

200లకు పైగా సినిమాలు.. కనీసం చివరి చూపుకు కూడా సినిమావాళ్లు రాలేదు

ఈ క్రమంలోనే ఇప్పుడు అనిల్ నెక్ట్స్ సినిమా గురించి కొందరు ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు. ఓ డిజాస్టర్ హీరో, అట్టర్ ఫ్లాప్ హీరోయిన్ తో అనిల్ నెక్ట్స్ సినిమా ఉంటుందని.. ఇప్పుడు ఎందుకు దొరకడో చూద్దాం.! అంటూ ఫన్నీగా మీమ్స్ షేర్ చేస్తున్నారు నెటిజన్స్.. ఇంతకూ ఆ హీరో, హీరోయిన్ ఎవరో తెలుసా.? అఖిల్ అక్కినేని, శ్రీలీలతో అనిల్ సినిమా.. ఈసారి పక్కా దొరుకుతాడు అని నెటిజన్స్ అంటున్నారు. అఖిల్ వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా సరైన హిట్ అందుకోలేకపోయాడు. అలాగే శ్రీలీల కూడా హిట్స్ అందుకోలేకపోతుంది. పెద్ద హీరోలతో సినిమాలు చేసినా ఈ అమ్మడికి హిట్స్ లేవు. ఇప్పుడు ఈ ఇద్దరినీ పెట్టి సినిమా చేస్తే అనిల్ ఎందుకు దొరకడో చూద్దాం.! అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్..

ఇవి కూడా చదవండి

ఆ హీరో ఉత్త అమాయకుడు, మంచివాడు.. ఏది చెప్పిన చేసేవాడు.. ఆసక్తికర విషయం చెప్పిన తేజ

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..