Jagapathi Babu: కన్నీరు పెట్టించే జ్ఞాపకాన్ని పంచుకున్న సుశీల.. నాగార్జున ఎమోషనల్..
బుల్లితెరపై ఇప్పుడు కొత్తగా వస్తున్న టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా.. ఇన్నాళ్లు హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించిన విలక్షణ నటుడు జగపతి బాబు ఇప్పుడు హోస్ట్ గా మెప్పించేందుకు రెడీ అయ్యారు. ఆయన హోస్టుగా చేస్తున్న ఈ షోకు సంబంధించి రోజుకో ప్రోమో విడుదలవుతుంది. తాజాగా ఈ షోకు సంబంధించి మరో ప్రోమో రిలీజ్ అయ్యింది.

బుల్లితెరపై టాక్ షోలకు ఎంతగా క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. ఆమధ్య కాలంలో ఆహాలో వచ్చిన అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఆ షోతో హోస్టుగా నందమూరి బాలకృష్ణ అదరగొట్టేశారు. ఇక ఇప్పుడు మరో హీరో ఓ రియాల్టీ షోకు హోస్టింగ్ చేసేందుకు రెడీ అయ్యారు. ఆయనే విలక్షణ నటుడు జగపతి బాబు. ఇన్నాళ్లు అటు హీరోగా, విలన్ గా మెప్పించిన జగపతి బాబు.. ఇప్పుడు హోస్టుగా అలరించేందుకు వస్తున్నారు. ఆయన హోస్టింగ్ చేస్తున్న రియాల్టీ షో జయమ్ము నిశ్చయమ్మురా. జీ తెలుగులో ఆగస్ట్ 17 నుంచి రాత్రి 9 గంటలకు ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఇక మొదటి ఎపిసోడ్ కు టాలీవుడ్ మన్మథుడు కింగ్ నాగార్జున గెస్టుగా వచ్చారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పలు ప్రోమోలు రిలీజ్ చేయగా.. ఇప్పుడు మరో ప్రోమో విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..
ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉండే నాగార్జున.. చాలా కాలం తర్వాత ఓ రియాల్టీ షోలో పాల్గొన్నారు. ఈ షోలో నాగ్ కెరీర్, ఫ్యామిలీ, కాలేజ్, స్కూల్.. ఇలా ప్రతి విషయం గురించి అడిగి తెలుసుకున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో నాగార్జున సిస్టర్ సుశీల ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తన జీవితంలోని కష్టసమయంలో నాగార్జున తనకు అండగా ఉన్న విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఆమె మాట్లాడుతుండగానే నాగార్జున భావోద్వేగానికి గురయ్యారు.. అంతకు ముందు ప్రోమోలో నాగార్జున మాట్లాడుతూ తన తండ్రి నాగేశ్వర రావుతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.
ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..
నాగార్జున మాట్లాడుతూ.. “యాక్టింగ్ చేయాలనుకుంటున్నట్లు నా బ్రదర్ వెంకట్ తో కలిసి నాన్న దగ్గరికెళ్లి చెప్పాం. అప్పుడు ఆయన కళ్లల్లో నీళ్లు చూశాను. ఆ తర్వాత అన్నమయ్య సినిమా చూసి రాగానే నా రెండు చేతులు ఇళా పట్టుకుని నాన్న మాట్లాడిన క్షణాలు నేను జీవితంలో మర్చిపోలేను” అంటూ గుర్తుచేసుకున్నారు. అలాగే నాగేశ్వరరావు చివరి రోజులను గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు నాగార్జున.
ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?








