AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NC24: నాగచైతన్య పాన్ ఇండియా మూవీ షురూ.. మరో బ్లాక్ బస్టర్ పక్కా అంటున్న ఫ్యాన్స్

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా (ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు కలెక్షన్స్ పరంగానూ ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది.

NC24: నాగచైతన్య పాన్ ఇండియా మూవీ షురూ.. మరో బ్లాక్ బస్టర్ పక్కా అంటున్న ఫ్యాన్స్
Nc24
Rajeev Rayala
|

Updated on: May 07, 2025 | 9:05 PM

Share

అక్కినేని అందగాడు నాగ చైతన్య రీసెంట్ గా తండేల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ సినిమా యదార్ధ ఘటన ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో నాగ చైతన్య మత్యకారుడిగా నటించి ఆకట్టుకున్నాడు. చైతూకు జోడీగా సాయి పల్లవి నటించి మెప్పించింది. దేవీ శ్రీ సంగీతం అందించిన తండేల్ సినిమా మ్యూజిక్ పరంగానూ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు నాగ చైతన్య మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో చైతూ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మైథలాజికల్ థ్రిల్లర్ గా ఉండనుంది.

నాగ చైతన్య కెరీర్ లో ఇది 24వ సినిమా. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. నాగ చైతన్య నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను విడుదల చేశారు. ఆద్యంతం ఆకట్టుకునే ఎలిమెంట్స్‌తో తీర్చిదిద్దిన వీడియో సినిమాపై అంచనాలను పెంచింది. ఇప్పటివరకు తెలుగులో తెరకెక్కని మైథలాజికల్ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కార్తీక్ దండు. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్‌ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ తాజాగా మొదలైంది. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాలో నాగచైతన్యకుజోడీగా మీనాక్షి చౌదరి నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ‘కాంతార’, ‘విరూపాక్ష’ సినిమాలకు సంగీతం అందించిన అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చనున్నారని అంటున్నారు. ఈ సినిమాకు వృష కర్మ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమా చైతన్య కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు అంటున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో చూడాలి.

View this post on Instagram

A post shared by NC24 (@nc24chronicles)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెబుతాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెబుతాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!
శాఖాహారుల్లోనే జుట్టు రాలే సమస్య ఎక్కువ ఎందుకో తెలుసా?
శాఖాహారుల్లోనే జుట్టు రాలే సమస్య ఎక్కువ ఎందుకో తెలుసా?
'కులం చుట్టూ తిరిగే.. హార్డ్‌ హిట్టింగ్ సినిమా ఇది'
'కులం చుట్టూ తిరిగే.. హార్డ్‌ హిట్టింగ్ సినిమా ఇది'
ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్.. 100 సంవత్సరాల వరకు జీవిత బీమా..!
ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్.. 100 సంవత్సరాల వరకు జీవిత బీమా..!