పవన్ కల్యాణ్‌తో డేటింగ్ చేస్తా.. ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటా.. యంగ్ బ్యూటీ క్రేజీ కామెంట్స్
యంగ్ హీరోయిన్స్ చాలా మంది ఓవర్ నైట్ లో స్టార్ డమ్ సొంతం చేసుకుంటున్నారు. కొంతమంది వరుస సినిమాలతో పేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారిలో ఈ చిన్నది ఒకరు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోతుంది. ఇంతకూ ఈ క్రేజీ బ్యూటీ ఎవరో తెలుసా.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నరు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.. ఇక పవన్ సినిమాల విషయానికొస్తే క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు సినిమా, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాల్లో ప్రస్తుతం హరిహరవీరమల్లు, ఓజీ సినిమాల షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. రాజకీయాలతో పాటు సమయం దొరికినప్పుడు షూటింగ్స్ లో పాల్గొంటున్నారు.రీసెంట్ గా హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేశారు పవన్. పవన్ లానే ప్రభాస్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సలార్, కల్కి సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న ప్రభాస్. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆయా షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఓ ముద్దుగుమ్మ పవన్ కల్యాణ్ తో డేటింగ్ చేస్తా.. ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి షాక్ ఇచ్చింది. ఇంతకూ ఆ బ్యూటీ ఎవరో తెలుసా..? తన అందంతో ప్రేక్షకులను విశేషంగా కవ్వించిన బ్యూటీస్ లో ఫరియా అబ్దుల్లా.. జాతిరత్నాలు సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంది ఈ అందాల భామ. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఫరియా అబ్దుల్లా ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది.
ప్రస్తుతం ఫరియా అబ్దుల్లా ఓ డాన్స్ షోకు జడ్జ్ గా వ్యవహరిస్తోంది. అలాగే తాజాగా సుమతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది ఫరియా అబ్దుల్లా. ఈ చిట్ చాట్ లో ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది. నీకు ఛాన్స్ వస్తే ఎవరితో డేట్ చేస్తావ్, ఎవరిని పెళ్లి చేసుకుంటావ్.? అని సుమ అడిగితే.. ఊహించని సమాధానం చెప్పింది. నాకు ఛాన్స్ వస్తే పవన్ కల్యాణ్ తో డేటింగ్ చేస్తా.. ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటా.. అని చెప్పుకొచ్చింది ఈ చిన్నది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ కామెంట్స్ పై పవన్ , ప్రభాస్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి