- Telugu News Photo Gallery Cinema photos Tollywood heroines like rashmika mandanna sreeleela keerthy suresh getting more chances in bollywood
సౌత్ బ్యూటీస్ డేట్స్ కోసం క్యూ కడుతున్న నార్త్ మేకర్స్
సౌత్ సినిమా నేషనల్ మార్కెట్‌ను రూల్ చేస్తుండటంతో సౌత్ బ్యూటీస్ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు నార్త్ మేకర్స్. ఇప్పటికే రష్మిక లాంటి బ్యూటీస్ నార్త్ మార్కెట్‌లో జెండా పాతేయగా ఇప్పుడు మరికొంత మంది యంగ్ బ్యూటీస్ ఇదే ప్రయత్నాల్లో ఉన్నారు.నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు నార్త్‌లోనూ మోస్ట్ వాంటెడ్‌గా మారిపోయారు.
Updated on: May 07, 2025 | 7:51 PM

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు నార్త్‌లోనూ మోస్ట్ వాంటెడ్‌గా మారిపోయారు. ఒక్క సికందర్ తప్ప బాలీవుడ్‌లో రష్మిక చేసిన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి.

నయనతార, కీర్తి సురేష్ చెరో సినిమా మాత్రమే చేసినా.. అవి కూడా మంచి వసూళ్లు సాధించాయి. అందుకే సౌత్ బ్యూటీస్‌ను లక్కీ అని ఫీల్ అవుతున్నారు నార్త్ మేకర్స్.

మోస్ట్ టాలెంటెడ్ సౌత్ హీరోయిన్ సాయి పల్లవి, బిగ్ ప్రాజెక్ట్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న రామాయణ్‌లో సీత పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు జునైద్ ఖాన్‌కు జోడీగా ఓ లవ్ స్టోరీలోనూ కనిపించబోతున్నారు నేచురల్ బ్యూటీ.

రీసెంట్‌గా శ్రీలీల కూడా బాలీవుడ్ ఎంట్రీకి లైన్ క్లియర్ చేసుకున్నారు. కార్తీక్ ఆర్యన్ హీరోగా రూపొందుతున్న ఆశిఖీ 3తో నార్త్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆల్రెడీ బీటౌన్‌లో షూటింగ్ చేస్తున్న ఈ భామ, బాలీవుడ్ పార్టీస్‌లోనూ రెగ్యులర్‌గా కనిసిస్తున్నారు.

ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మీనాక్షి చౌదరి. సౌత్‌లో వరుస విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న మీనాక్షికి నార్త్ ఇండస్ట్రీ నుంచి పిలుపొచ్చింది. అది కూడా లేడీ ఓరియంటెడ్ సినిమా అన్న టాక్ వినిపిస్తుంది. ప్రజెంట్ డిస్కషన్ స్టేజ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలో మరింత క్లారిటీ రానుంది.




