- Telugu News Photo Gallery Cinema photos Heroes like suhas karthikeya prudhvi raj sukumaran becoming top villains in indian cinemas
అక్కడ టాప్ హీరోలు.. ఇక్కడ మాత్రం టాప్ విలన్స్
ఒక లాంగ్వేజ్‌లో హీరోలు... పొరుగు భాషకు వెళ్లినప్పుడు కూడా హీరోలుగానే కంటిన్యూ కావడం ఓ పద్ధతి. ఇక్కడ చేయలేని కేరక్టర్లను పొరుగు భాషల్లో చేయడం ఇంకో విధానం. మన యంగ్ స్టర్స్ చాలా మంది ఈ సెకండ్ వెర్షన్‌ని కంటిన్యూ చేస్తున్నారు. పృథ్విరాజ్ సుకుమారన్ మలయాళంలో మంచి హీరో. కానీ, పొరుగు భాషల్లో ఆయన విలన్‌గా పాపులర్ కావడానికే ఇష్టపడుతున్నారు.
Updated on: May 07, 2025 | 7:48 PM

ఒక లాంగ్వేజ్‌లో హీరోలు... పొరుగు భాషకు వెళ్లినప్పుడు కూడా హీరోలుగానే కంటిన్యూ కావడం ఓ పద్ధతి. ఇక్కడ చేయలేని కేరక్టర్లను పొరుగు భాషల్లో చేయడం ఇంకో విధానం. మన యంగ్ స్టర్స్ చాలా మంది ఈ సెకండ్ వెర్షన్‌ని కంటిన్యూ చేస్తున్నారు

పృథ్విరాజ్ సుకుమారన్ మలయాళంలో మంచి హీరో. కానీ, పొరుగు భాషల్లో ఆయన విలన్‌గా పాపులర్ కావడానికే ఇష్టపడుతున్నారు. తారక్ కూడా బాలీవుడ్‌లో war2లో విలన్‌గానే నటిస్తున్నారన్నది టాక్.

సీనియర్లే కాదు.. జూనియర్లు కూడా ఈ ఫార్ములాను ఫాలో అవుతున్నారు.మన దగ్గర డిఫరెంట్ కంటెంట్‌తో హీరోగా అడపాదడపా హిట్లు చూసిన కార్తికేయ తమిళంలో ఏకంగా అజిత్‌కి విలన్‌గా మెప్పించారు.

రేసర్‌గా కార్తికేయకు మంచి మార్కులే పడ్డాయి. నవీన్ చంద్ర కూడా హీరోగా, విలన్‌గా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఆదిపినిశెట్టికి హీరోగా మంచి మార్కెట్ ఉంది.

అయినా స్టార్ హీరోలకు ధీటైన యంగ్ స్టైలిష్ విలన్‌గా నటించడానికి ఎప్పుడూ వెనకాడలేదు. లేటెస్ట్ గా సూరి సినిమా మండాడిలో విలన్‌గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు యంగస్టర్ సుహాస్. మంచి కేరక్టర్ పడాలేగానీ, కొందరు ఆర్టిస్టులు విలన్ గానూ చేయడానికి రెడీ అన్నమాట.




