AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani: తన దూకుడుతో వాళ్లను భయపెడుతున్న నేచురల్ స్టార్

హిట్లు అందరూ కొడతారు.. కానీ వచ్చిన మార్కెట్‌ను సినిమా సినిమాకు ఎలా పెంచుకోవాలనేది మాత్రం చాలా తక్కువ మంది హీరోలకే తెలుసు. అందులో ఆరితేరిపోయారు నాని. ఇంకా చెప్పాలంటే తన ఎదుగుదలతో తోటి హీరోలను భయపెడుతున్నారు న్యాచురల్ స్టార్. తన చుట్టూ ఓ కోటనే నిర్మించుకుంటున్నారీయన. తాజాగా హిట్ 3తో ఊచకోత కోస్తున్నారు నాని.

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: May 07, 2025 | 7:43 PM

Share
మీడియం రేంజ్ హీరోలే కాదు.. మిగిలిన అందరు హీరోలు భయపడేలా దూసుకుపోతున్నారు నాని. ఒక్కో సినిమాతో తన రేంజ్ పెంచుకుంటున్నారు. మార్కెట్ మాత్రమే కాదు.. తనకంటూ కొందరు దర్శకులు, టెక్నీషియన్స్ ఇలా ఓ కోటనే నిర్మించుకుంటున్నారు ఇండస్ట్రీలో.

1 / 5
తాజాగా హిట్ 3 కూడా 4 రోజుల్లోనే 100 కోట్ల మార్క్ అందుకునేలా కనిపిస్తుంది. దసరా, సరిపోదా శనివారం తర్వాత నాకికి ఇది మూడో సెంచరీ.కరోనా ముందు వరకు నాని సినిమాలకు మహా అయితే 10 కోట్ల ఓపెనింగ్ వచ్చేది.. కానీ ఇప్పుడా స్థాయి 40 కోట్లకు చేరిపోయింది.

2 / 5
రెండేళ్ళ కింద దసరా 38 కోట్ల ఓపెనింగ్ తెస్తే.. హిట్ 3 ఏకంగా 43 కోట్లు తీసుకొచ్చింది. కేవలం 4 రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసే స్థాయికి వచ్చేసింది నాని రేంజ్. అలాగే ఓవర్సీస్‌లోనూ 3 రోజుల్లోనే 2 మిలియన్ క్రాస్ చేసి.. 2.5 మిలియన్ వైపు పరుగులు పెడుతుంది హిట్ 3.

3 / 5
నాని దూకుడు చూస్తుంటే.. ఇక ఈయన్ని మీడియం రేంజ్ అనకూడదేమో..? నెక్ట్స్ ప్యారడైజ్‌తో 50 కోట్ల ఓపెనింగ్ తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. టైమ్ అందరికీ నడుస్తుంటుంది.. కానీ ఆ టైమ్‌లోనే కెరీర్ సెట్ చేసుకోవడం కాదు.. తనకంటూ సాలిడ్ కోటనే నిర్మిస్తున్నారు నాని. ఇటు హీరోగా.. అటు నిర్మాతగా తిరుగులేని జర్నీ సాగిస్తున్నారు.

4 / 5

నాని ఓ కథ ఫైనల్ చేస్తే బొమ్మ బ్లాక్‌బస్టర్ అంతే..! అందుకే చిరంజీవి లాంటి మెగాస్టార్ కూడా శ్రీకాంత్ ఓదెల సినిమా ఓకే చేయడానికి నానినే నిర్మాతగా ఉండాలని కండీషన్ పెట్టారు. మొత్తానికి సినిమా సినిమాకు తన స్థాయి పెంచుకుంటూ.. తోటి హీరోలు తనతో పోటీ పడటానికి కూడా భయపడేలా చేస్తున్నారు నాని.

5 / 5
Follow Us
పిల్లలకు ఈ 5 రూల్స్ నేర్పించండి.. ఎక్కడ తప్పిపోయినా సురక్షితంగా..

పాము - ముంగిస ఎందుకు శత్రువులు? అది చిన్న కథకాదు..సవతుల పోరు!

హ్యాకర్ల చేతిలో పబ్లిక్ నెట్‌వర్క్​లు.. మైక్రోసాఫ్ట్‌ వార్నింగ్

ఏనుగులు ఆయన మాట వింటాయి! ఈ ఆనంద్ షిండే ఎవరు?

ఉదయాన్నే 4 తులసి ఆకులు తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

బడ్జెట్ ధరలో నావో బడ్స్ ఎక్స్1 వైర్‌లెస్ ఇయర్‌బడ్స్

షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే

ఉప్పు నిమ్మకాయ సెంటిమెంట్.. విదేశాల్లోనూ వర్కవుట్ అవుతోందట!

వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా.. జబర్దస్త్ వెంకీ వీడియో వైరల్

కొబ్బరి నూనె vs ఆముదం.. పిల్లల జుట్టుకు ఏది బెస్ట్‌?