- Telugu News Photo Gallery Cinema photos Vijay devarakonda rashmika mandanna sharing the screen again know the details here
Vijay Devarakonda: ముచ్చటగా మూడోసారి.. రష్మిక గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారా ??
కొంతమంది ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి ఫిదా అయిపోతుంటారు జనాలు. అలాంటి మేజిక్ క్రియేట్ చేసిన జోడీ విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన్న. వీరిద్దరు కలిసి మరోసారి ఎప్పుడు స్క్రీన్ షేర్ చేసుకుంటారా? అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. అదిగో ఇదిగో అంటూ మాట్లాడుకుంటూనే ఉన్నారు నెటిజన్లు.. ఇప్పుడు ఆ టైమ్ రానే వచ్చిందా?
Updated on: May 07, 2025 | 7:36 PM

మేడమ్ మేడమ్ అంటూ విజయ్ దేవరకొండ, చిర్రుబుర్రులాడుతూ రష్మిక మందన్న గీతగోవిందంలో పండించిన కెమిస్ట్రీని అంత తేలిగ్గా మర్చిపోలేరు ఆడియన్స్. ఇప్పటికీ గీతగోవిందం క్లిప్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.

ఆ తర్వాత చేసిన డియర కామ్రేడ్‌కి కూడా స్పెషల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. డియర్ కామ్రేడ్ తర్వాతవీరిద్దరి కాంబోలో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగ ఎదురుచూస్తున్నారు. ఆ టైమ్ రానే వచ్చిందనే హింట్స్ అందుతున్నాయి.

విజయ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఇందులో రష్మిక నాయికగా నటిస్తారని గత కొన్నాళ్లుగా న్యూస్ స్ప్రెడ్ అవుతోంది.

Hmm lets see... అంటూ పోస్ట్ పెట్టి రష్మికను ట్యాగ్ చేసింది ప్రొడక్షన్ హౌస్. ఓకే.. అంటూ నవ్వుతున్న ఎమోజీలతో రిప్లై ఇచ్చేశారు రష్మిక. ఆ ఒక్క పోస్టుతోనే మాకంతా అర్థమైపోయిందని పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన కాంబో సెట్ అయిందని ఖుషీగా ఉన్నారు. రాహుల్ డైరక్షన్‌లో రష్మిక అండ్ విజయ్ సూపర్ కాంబో ఫిక్స్ అని విషయాన్ని వైరల్ చేస్తున్నారు.




