AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mufasa: The Lion King: ఓటీటీలోకి వచ్చేస్తున్న ముఫాసా తెలుగు వర్షన్.. ఎక్కడ చూడొచ్చంటే

ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీతెరకెక్కించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ముఫాసా ది లయన్ కింగ్ ఒకటి. ఇప్పటికే ది లయన్ కింగ్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే గత ఏడాది విడుదలైన ముఫాసా ది లయన్ కింగ్ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేశారు

Mufasa: The Lion King: ఓటీటీలోకి వచ్చేస్తున్న ముఫాసా తెలుగు వర్షన్.. ఎక్కడ చూడొచ్చంటే
Mufasa
Rajeev Rayala
|

Updated on: Mar 12, 2025 | 2:02 PM

Share

హాలీవుడ్ సినిమాలకు మన దగ్గర మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే ఎన్నో హాలీవుడ్ సినిమాలు తెలుగులోనూ డబ్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి. ఈ మద్యకాలంలో హాలీవుడ్ సినిమాలు కూడా మన తెలుగు సినిమాలకు పోటీగా విడుదలవుతున్నాయి. అంతే కాదు తెలుగులో మార్కెట్ పెంచుకునేందుకు మన హీరోలతో డబ్బింగ్ కూడా చెప్పిస్తున్నారు. ఆ మధ్య వచ్చిన అవైజర్స్ సినిమాలో థానోస్ పాత్రకు దగ్గుబాటి హీరో రానా వాయిస్ ఇచ్చిన విషయం తెలిసిందే.. ఆతర్వాత వచ్చిన లయన్ కింగ్ సినిమాలో చాలా మంది తెలుగు ఆర్టిస్ట్ లు వాయిస్ లు ఇచ్చారు. సింబా పాత్రకు నాని, అలాగే టిమోన్ పాత్రకు అలీ, పుంబా పాత్రకు బ్రహ్మానందం వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇక రీసెంట్ గా వచ్చిన ముఫాసా సినిమాలో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి :ఎన్టీఆర్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన చిట్టి.. ఫరియా అబ్దుల్లా అదరగొట్టిందిగా..

హాలీవుడ్‌ సంస్థ డిస్నీ నిర్మించిన ముఫాసా సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా వచ్చి నెలలు గడుస్తున్నా ఓటీటీలోకి మాత్రం  రాలేదు. అయితే ఇంగ్లీష్ లో మాత్రం ఓటీటీలో అందుబాటులో ఉంది ఈ సినిమా.. అయితే తెలుగు వర్షన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆడియన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు తెలుగు వర్షన్ ఓటీటీలోకి రాబోతుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: ఈమెను మించిన హాట్ బ్యూటీ ఉంటుందా..! చేసింది రెండు సినిమాలు.. ఒకొక్క మూవీకి అందుకుంటుంది రూ.3 కోట్లు

ముఫాసా సినిమా తెలుగు వర్షన్ ను జియో హాట్ స్టార్ అందుబాటులోకి తీసుకురానుంది. మార్చ్ 26నుంచి ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ముఫాసా సినిమా గతంలో వచ్చిన లయన్ కింగ్ సినిమాకు ప్రీక్వెల్.. సింబా తండ్రి ముఫాసా ఎలా రాజుగా మారాడు అనే కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. అలాగే ఈ సినిమాలో టాకా పాత్రకు సత్యదేవ్ వాయిస్ ఇచ్చారు. ఇక ఇప్పుడు ముఫాసా తెలుగులోకి రానుండటంతో ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ప్రేమించినవాడి కోసం మతం మార్చుకుంది.. పేరు మార్చుకుంది.. చివరకు ఇలా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్