Nithiin: నితిన్‌కు ఎమ్.ఎస్ ధోని సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఆనందంలో తేలిపోతున్న కుర్రహీరో ..

ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు నితిన్.

Nithiin: నితిన్‌కు ఎమ్.ఎస్ ధోని సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఆనందంలో తేలిపోతున్న కుర్రహీరో ..
Nithin
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 29, 2023 | 3:35 PM

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హిట్లు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు నితిన్. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలోనే నితిన్ కు ఓ ఊహించని గిఫ్ట్ వచ్చింది. అది చూసి ఆనందంలో మునిగిపోయాడు నితిన్.

ఇంతకు నితిన్ ను సర్ప్రైజ్ చేసింది ఎవరో తెలుసా.. ఆయన మరెవరో కాదు ప్రముఖ క్రికెటర్ ఎమ్ ఎస్ ధోని. క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని నితిన్ ను సర్ప్రైజ్ చేశాడు. తన ఆటోగ్రాఫ్ ఉన్న ఓ టి షర్ట్ ను నితిన్ కు పంపించాడు ధోని. దాంతో నితిన్ ఆనందనానికి అవధులు లేకుండా పోయాయి.

ధోని పంపించిన టీషర్ట్ తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు నితిన్. ఆ టి షర్ట్ పట్టుకొని ఉన్న పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక నితిన్ సాలిడ్ సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 8న విడుదల కానుంది. ఈ సినిమాతో నితిన్ పక్కా హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ సొంతం చేసుకుంటుందో చూడలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.