Mrunal Thakur: సరదా మాటలు ఇంతగా బాధిస్తాయని తెలియదు.. నన్ను క్షమించండి.. మృణాల్ ఠాకూర్..
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పేరు ఎక్కువగా వినిపిస్తున్న సంగతి. కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేసిన తొలి రోజుల్లో ఆమెకు సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. అందులో ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ మండిపడుతున్నారు. తాజాగా ఆ వీడియో పై మృణాల్ స్పందించారు.

మృణాల్ ఠాకూర్.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఆమె.. మొదట్లో పలు సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఆ తర్వాత హిందీలో కథానాయికగా వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంది. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆతర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా మృణాల్ కు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో హీరోయిన్ బిపాస బసు అందాన్ని, ఫిట్నెస్ ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఆమె మాటలు విమర్శలకు దారితీయడంతో తాజాగా తన ఇన్ స్టా వేదికగా రియాక్ట్ అయ్యారు. తాను టీనేజ్ లో ఉన్నప్పుడు చేసిన కామెంట్స్ ఇంతగా బాధిస్తాయని తెలియదని.. అందుకు క్షమించాలని కోరింది.
ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?
“19 ఏళ్ల వయసులో తెలివి తక్కువగా మాట్లాడాను. అందంపై సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంతమందిని బాధిస్తాయని నాకు అప్పుడు అర్థం కాలేదు. అలా మాట్లాడినందుకు తీవ్రంగా చింతిస్తున్నాను. ఎవరినీ అవమానించాలని అలా మాట్లాడలేదు. అది చాలా సంవత్సరాల క్రితం సరదాగా సాగిన ఇంటర్వ్యూ. ఇప్పుడు ఇంతదూరం వస్తుందని అనుకోలేదు. నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది. సంవత్సరాలు గడిచేకొద్ది అందానికి అసలైన నిర్వచనం నాకు అర్థమైంది. అది ఎంతో విలువైనది. మనసుతో చూస్తే ప్రతిదానిలోనూ సౌందర్యం ఉంటుంది” అంటూ రాసుకొచ్చింది.

Mrunal Thakur
ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..
గతంలో ఓ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ.. బిపాసా బసు కంటే చాలా అందంగా ఉంటానని చెప్పారు. ఆమె కండలు తిరిగిన పురుషుడిలా కనిపిస్తారని.. ఆమెతో పోలిస్తే తాను ఎన్నో రెట్లు అందంగా ఉంటానని అన్నారు. ఇప్పుడు అదే వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. దీంతో మృణాల్ తీరుపై అటు సెలబ్రెటీల నుంచి.. ఇటు అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. మరోవైపు బిపాసా సైతం పరొక్షంగా ఆమెకు కౌంటరిచ్చారు. దీంతో ఇప్పుడు మృణాల్ ఇన్ స్టా వేదికగా క్షమాపణలు చెప్పింది.
ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..
View this post on Instagram
ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..







