AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఇదెక్కడి సినిమా రా బాబూ.. కలలో సైతం వెంటాడే సీన్లు.. ఒంటరిగా అస్సలు చూడలేం..

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సినిమాలు చూసేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా హారర్, సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్ మిస్టరీ చిత్రాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఓటీటీలో ఎప్పటికప్పుడు సరికొత్త సస్పెన్స్, హారర్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ మూవీ చూడాలంటే ఎంతో ధైర్యం ఉండాల్సింది. ఇంతకీ అదేం సినిమా అంటే..

Cinema : ఇదెక్కడి సినిమా రా బాబూ.. కలలో సైతం వెంటాడే సీన్లు.. ఒంటరిగా అస్సలు చూడలేం..
Cinema (13)
Rajitha Chanti
|

Updated on: Nov 23, 2025 | 4:45 PM

Share

హారర్ సినిమాలు చూడాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. కానీ ఎంత భయంకరంగా.. గుండెల్లో వణుకుపుట్టించే సీన్స్ ఉన్నప్పటికీ హారర్ సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే ఈమధ్య కాలంలో ఓటీటీల్లో ఎక్కువగా ఆ జానర్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే పలు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హారర్ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. చూస్తున్నంతసేపు ఒక దెయ్యం మన పక్కనే ఉందేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఆ సినిమాలో వచ్చే సీన్స్ చూడడం అంత సులభమేమి కాదు. మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ నటించిన లేటేస్ట్ సినిమా అదే డైస్ ఎరా.

ఇవి కూడా చదవండి : Cinema : రూ.32 కోట్లు పెట్టి తీస్తే రూ.440 కోట్ల కలెక్షన్స్.. ఆరేళ్లుగా సంచలనం.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..

ఈ చిత్రంలో ప్రణవ్ మోహన్ లాల్, సుష్మితా భట్, షిన్ టామ్ చాకో, గిబిన్ గోపీనాథ్ కీలకపాత్రలు పోషించారు. భూతకాలం, బ్రహ్మయుగం వంటి చిత్రాలను తెరకెక్కించిన డైరె్కట్ర రాహుల్ సదాశివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. YNOT స్టూడియోస్, నైట్ షిఫ్ట్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మించాయి. అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి 7.4/10 IMDb రేటింగ్ లభించింది.

ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..

ఇదెలా ఉంటే.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియో హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : Suryavamsham : హీరోగా సూర్యవంశం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా.. ?

ఇవి కూడా చదవండి : Actress : కోట్లలో అప్పులు.. తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి ఈ బిగ్ బాస్ బ్యూటీ..

Follow Us