AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: టాప్-5లో ఉండేది వీళ్లే.. బిగ్‌బాస్‌పై నాగబాబు అంచనా నిజమవుతుందా?

బిగ్ బాస్ తెలుగు 9లో వీకెండ్ ఎపిసోడ్ లో మెగా బ్రదర్ నాగబాబు సందడి చేశారు. గతంలో భరణి శంకర్ ఓపెన్ గా తన మద్దతు ప్రకటించిన ఆయన ఇప్పుడు బిగ్ బాస్ టాప్- 5 లిస్ట్ ను కూడా ప్రకటించారు.

Bigg Boss Telugu 9: టాప్-5లో ఉండేది వీళ్లే.. బిగ్‌బాస్‌పై నాగబాబు అంచనా నిజమవుతుందా?
Bigg Boss Telugu 9
Basha Shek
|

Updated on: Nov 23, 2025 | 4:13 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పుడు 11 వారం ఎండింగ్ కు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ లేటెస్ట్ వీకెండ్ ఎపిసోడ్స్ ఆహ్లాదకరంగా సాగాయి. బిగ్ బాస్ డయాస్ పైకి కొందరు సెలెబ్రిటీలు, హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు వచ్చారు. అలాగే మాజీ కంటెస్టెంట్స్ కూడా సందడి చేశారు. ముఖ్యంగా మెగా బ్రదర్ నాగబాబు ఎపిసోడ్ చాలా ఫన్నీగా సాగింది. ఆయనతో పాటు భరణి తల్లి కూడా బిగ్ బాస్ డయాస్ పైకి వచ్చారు. వారిద్దరినీ చూడగానే భరణి సంతోషంతో ఉప్పొంగిపోయారు. ‘నా గురువు నా తల్లి వచ్చారు. బిగ్ బాస్ హౌస్ లో ఇంతకి మించిన బెస్ట్ మూమెంట్ లేదు’ అని భరణి ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా నాగబాబు భరణితో ఉన్న అనుబంధం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘మేమిద్దరం కలిసి టీవీ సీరియల్స్ లో నటించాం. ఆ సమయంలో భరణి చాలా అగ్రెసివ్ గా ఉండేవాడు. కానీ బిగ్ బాస్ షోకి వెళ్లిన తర్వాత మరీ సాఫ్ట్ గా, గంగి గోవులా మారిపోయాడు. మరీ అంత సాఫ్ట్ నెస్ అవసరం లేదు’ అని భరణికి సూచించారు నాగబాబు.

ఇవి కూడా చదవండి

కాగా ఓ బాక్స్ లో కొన్ని సినిమా క్యారెక్టర్స్ బయటకి తీసిన నాగార్జున ఆ క్యారెక్టర్ హౌస్ లో ఎవరికి సూట్ అవుతుందో చెప్పాలని నాగబాబుని అడిగారు. ముందుగా గజినీ క్యారెక్టర్ వచ్చింది. హౌస్ లో ఉన్న గజినీ భరణీనే అని నాగబాబు అన్నారు. అగ్రెసివ్ గా ఆడాలనే విషయం మరచిపోతున్నాడని భరణిపై సెటైర్లు వేశాడు. ఇక రెండవ క్యారెక్టర్ హాసిని రాగా.. బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడూ నవ్వుతూనే ఉండే అమ్మాయి రీతూ చౌదరీ ఈ క్యారెక్టర్ కు సూటవుతుందని మెగా బ్రదర్ చెప్పుకొచ్చాడు. ఇదే సందర్భంగా నాగబాబు బిగ్ బాస్ హౌస్ టాప్ 5 ఎవరు ఉంటారో అంచనా వేశాడు. భరణితో పాటు తనూజ, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, సంజన టాప్ 5 లో ఉంటారని నాగబాబు చెప్పుకొచ్చారు. మరి బిగ్ బాస్ పై మెగా బ్రదర్ నాగ బాబు అంచనాలు నిజమవుతాయో? లేదో? తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us