AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohan Babu: అజ్ఞాతంలో మోహన్ బాబు.. పారిపోలేదంటూ ట్వీట్..

టీవీ9 రిపోర్టర్ రంజిత్‌పై దాడికి నిరసనగా తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్టు సంఘాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. నాలుగు రోజులుగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మోహన్ బాబు వాంగ్మూలం రికార్డు చేయడానికి ప్రయత్నించారు పోలీసులు.

Mohan Babu: అజ్ఞాతంలో మోహన్ బాబు.. పారిపోలేదంటూ ట్వీట్..
Mohanbabu
Rajitha Chanti
|

Updated on: Dec 14, 2024 | 12:59 PM

Share

మొన్నటివరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ వివాదం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదాన్ని కవరేజీ చేసేందుకు వెళ్లిన మీడియాపై మోహన్ బాబు దాడి చేశాడు. టీవీ9 మీడియా రిపోర్టర్ రంజిత్ పై దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దాడి అనంతరం రెండు రోజులు ఆసుపత్రిలో ఉన్న మోహన్ బాబు ఆ తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లారు. మీడియాపై దాడి కేసులో మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులో మోహన్ బాబు వాంగూల్మం రికార్డ్ చేయడానికి వెళ్లిన పోలీసులకు ఆయన కనిపించలేదు. దీంతో మోహన్ బాబు కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడిచింది. తాజాగా తన గురించి వస్తున్న వార్తలపై మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యాడు.

సోషల్ మీడియాలో మోహన్ బాబు మిస్సింగ్ అంటూ హంగామా నడుస్తున్న సమయంలో ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు . “నేను ఎక్కడికీ వెళ్లిపోలేదు. నాపై తప్పుడు ప్రచారం జరుగుతుంది. ముందస్తు బెయిల్ తిరస్కరించలేదు. ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాడు. నా గురించి అసత్యపు వార్తలు రాయకండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను” అంటూ ట్వీట్ చేశాడు.

ఇదిలా ఉంటే.. మోహన్‌బాబు తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు ప్రజాప్రతినిధులు. అలా సహనం కోల్పోయి మీడియా ప్రతినిధులపై దాడి చేయడం సరికాదంటున్నారు. మోహన్‌బాబు సంయమనం కోల్పోయి ప్రవర్తించడం సరికాదన్నారు. టీవీ9 రిపోర్టర్ రంజిత్‌పై మోహన్ బాబు చేసిన దాడిని..తీవ్రంగా ఖండించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.ఈ వ్యవహారంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబు తీరుపై నిరసనలు కొనసాగిస్తున్నాయి జర్నలిస్ట్ సంఘాలు. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులుగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నాయి

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.