ఆ అందాన్ని వివరించలేను.. లెక్కించలేను.. ఎన్ని సంవత్సరాలు గడిచిన అవి ఆశ్చర్యకరమైనవే.. మెగాస్టార్ చిరంజీవి..
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. విషెస్ చెప్పడం దగ్గర్నుంచి.. తన సినిమా అప్ డేట్స్ వరకు అన్ని విషయాలను చిరు స్వయంగా
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. విషెస్ చెప్పడం దగ్గర్నుంచి.. తన సినిమా అప్ డేట్స్ వరకు అన్ని విషయాలను చిరు స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ.. అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. తాజాగా ఓ అద్భతమైన వీడియోను చిరు తన ట్విట్టర్ లో షేర్ చేశారు.
తన ఇంటి ఆవరణలోనుంచి సూర్యోదయాన్ని వీడియో తీసి దానిని.. తన అభిమానులతో పంచుకున్నారు… రోజులు, నెలలు, సంవత్సరాలు, శతాబ్దాలు పూర్తయినా సూర్యోదయం, సూర్యాస్తమయాల వెనకున్న ఆ అందాన్ని, అద్భుతాన్ని వివరించడానికి మాటలు చాలవు. ఈ ప్రపంచంలోని లెక్కలేనన్ని అందమైన దృశ్యాలను ఎన్నిసార్లు చూసిన తనివి తీరదు. ఈరోజు ఉదయం మా ఇంటి నుంచి తీసిన ఈ అందమైన వీడియోను మీకు పంచుకుంటున్నాను అంటూ రాసుకోచ్చారు చిరు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టి్ంట్లో వైరల్ గా మారింది. ప్రసుతం చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రామ్ చరణ్, పూజా హెగ్డే గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్మెట్స్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 13న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్ గతంలో ప్రకటించింది.
No matter how many days,months, years or centuries, the wonder and the delight the celestial beauty of the sunsets and sunrises cause are inexplicable,immeasurable.Can never get enough of them. Sharing another such moment, as seen from our house this morning!! #sunrise pic.twitter.com/FSQX0hgP5O
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 15, 2021
Also Read: తండ్రి సినిమాలో తనయుడి పూర్తిస్థాయి పాత్ర.. ఆ ఇద్దరు కలిసి నటిస్తే అభిమానులకు పండగే.