బ్లాక్ బస్టర్ డైరెక్టర్ పుట్టిన రోజు.. 50 కోట్ల బహుమతి.. శుభాకాంక్షలు తెలిపిన మైత్రీ మూవీస్..
మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు. మెగా హీరో వైష్ణవ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ.. ఆయన తెరకెక్కించిన
మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు. మెగా హీరో వైష్ణవ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ.. ఆయన తెరకెక్కించిన చిత్రం ‘ఉప్పెన’. వైష్ణవ్ సరసన కృతి శెట్టి హీరోయిన్గా నటించగా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించారు. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజు 10.42 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. ఈ క్రమంలో ఈరోజు (ఫిబ్రవరి 15న) ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాటు పుట్టినరోజు సందర్భంగా.. ఆయనకు మైత్రీ మూవీస్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపింది.
“మా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బుచ్చిబాబు సనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. అలాగే ఉప్పెన 50 కోట్ల కలెక్షన్లను రాబట్టిన సందర్భంగా ఆయనకు అభినందనలు” అంటూ ట్వీట్ చేసింది మైత్రీ మూవీస్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడే ఈ బుచ్చిబాబు సన. ఈయన తీసిన తొలి సినిమా ఉప్పెన మంచి టాక్‌తో దూసుకుపోతుంది.
Wishing our Director @BuchiBabuSana a Very Happy Birthday ♥
What better gift than a 50Cr Gross Blockbuster Weekend ?
– Team #Uppena #HBDBuchiBabuSana pic.twitter.com/by376EaiEo
— Mythri Movie Makers (@MythriOfficial) February 15, 2021
Also Read: నా జీవితంలో మూల స్థంభానివే నీవే అన్నా.. బాబీ పుట్టిన రోజున ఎమోషనల్ ట్వీట్ చేసిన అల్లు అర్జున్.