నా జీవితంలో మూల స్థంభానివే నీవే అన్నా.. బాబీ పుట్టిన రోజున ఎమోషనల్ ట్వీట్ చేసిన అల్లు అర్జున్.

అల్లు అర్జున్ సోదరుడు ఎవరంటే అందరూ టక్కున అల్లు శిరీష్ అని సమాధానం ఇస్తారు. అయితే బన్నీకి ఒక అన్న కూడా ఉన్నాడని చాలా కొంతమందికే తెలుసు. దీనికి కారణం...

నా జీవితంలో మూల స్థంభానివే నీవే అన్నా.. బాబీ పుట్టిన రోజున ఎమోషనల్ ట్వీట్ చేసిన అల్లు అర్జున్.
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 24, 2020 | 2:44 PM

allu arjun tweet about his brother birthday: అల్లు అర్జున్ సోదరుడు ఎవరంటే అందరూ టక్కున అల్లు శిరీష్ అని సమాధానం ఇస్తారు. అయితే బన్నీకి ఒక అన్న కూడా ఉన్నాడని చాలా కొంతమందికే తెలుసు. దీనికి కారణం ఆయన సినిమాల్లో నటించకపోవడమే. అయితే ఇటీవల బన్నీ అన్న సోషల్ మీడియాలో తరుచుగా కనిపిస్తున్నాడు. ఇక బన్నీ అన్నయ్య పేరు అల్లు వెంకటేష్. ఇతన్ని కుటుంబ సభ్యులంతా బాబీ అని పిలుస్తుంటారు.

తాజాగా బాబీ పుట్టిన రోజును (గురువారం) పురస్కరించుకొని అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా ఓ ఫొటోను పోస్ట్ చేసి అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శిరీష్, బన్నీ, బాబీ ముగ్గురు కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన అర్జున్.. ‘హ్యాపీ బర్త్‌డే బాబీ.. వచ్చే ఏడాది నీ జీవితంలో మరిచిపోలేని సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను. నువ్వు నా ప్రతీ సినిమాతో పాటు, నా జీవితానికి మూల స్థంభంలాగా నిలిచావు. ఈ రోజు సంతోషంగా గడుపు’ అంటూ క్యాప్షన్ జోడించాడు.