AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4 : అభిజీత్ హీరోగా తమన్నా హీరోయిన్ గా పెట్టి సినిమా తీస్తాన్న దెత్తడి హారిక..

బిగ్ బాస్ సీజన్ 4 లో హౌస్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి తనదైన యాటిట్యూడ్ తో ఆకట్టుకుంది  హారిక .

Bigg Boss 4 : అభిజీత్ హీరోగా తమన్నా హీరోయిన్ గా పెట్టి సినిమా తీస్తాన్న దెత్తడి హారిక..
Rajeev Rayala
|

Updated on: Dec 24, 2020 | 3:17 PM

Share

బిగ్ బాస్ సీజన్ 4 లో హౌస్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి తనదైన యాటిట్యూడ్ తో ఆకట్టుకుంది  హారిక . బిగ్ బాస్ కు వెళ్లకముందే ఎంతో మంది అభిమానులను సంపాధించుకుంది హారిక. అమెజాన్ కంపెనీలో మంచి మంచి పొజీషన్ లో ఉద్యోగం ఉన్నా టాలెంట్ ను నిరూపించుకోవడం కోసం జాబ్ ను వదిలేసింది. తెలంగాణ యాసలో అదరగొడుతూ యూట్యూబ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది.

తాజాగా టీవీ 9 తో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది ఈ అల్లరి పిల్ల. హారిక మాట్లాడుతూ.. ‘ఇంకా  బిగ్ బాస్ హౌస్ లోనే ఉన్న ఫీలింగ్ లో ఉన్నాను. మా ఇల్లుకూడా నాకు కొత్తగా ఉందని’తెలిపింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడానికి కారణం చెప్తూ ‘బయట తెలంగాణలోనే మాట్లాడుతా.. కానీ హౌస్ లో ఎదుటివాళ్ళు మాట్లాడుతుంటే నాకుకూడ ఇంగ్లిష్ వచ్చేసిందని’చెప్పింది . ఇక హారికాకు డైరెక్షన్ ఛాన్స్ వస్తే  బిగ్ బాస్ విన్నర్ అభిజీత్  హీరోగా, తమన్నాను హీరోయిన్ గా పెట్టి సినిమా తీస్తానని అలాగే సోహెల్ కు ఫ్రెండ్ క్యారెక్టర్,అఖిల్ ను విలన్ గా తీసుకుంటా అని చెప్పుకొచ్చింది హారిక.

ఇక బిగ్ బాగ్ హౌస్ లో హారిక అభిజీత్ మధ్య ఎదో జరుగుతుంది అని సోషల్ మీడియాలో చర్చ జరిగిన విషయం తెలిసిందే. చాలా మంది ఈ ఇద్దరిమధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని అభిప్రాయపడ్డారు. కానీ అభీ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని తెలిపింది. హౌస్ లో ఉన్నప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉన్నాం. మా ఇద్దరినీ అభిమానించిన ప్రేక్షకులందరికీ చాలా థాంక్స్ అని చెప్పింది. అలాగే బిగ్ బాస్ హౌస్ లో ఏడ్చినా వాళ్ళందరూ నిజంగా ఫీల్ అయ్యి ఏడ్చినా వాళ్ళే.. కమల్ హాసన్ గారు నన్ను సేవ్ చేసినప్పుడు నా ఫ్యూజులు ఎగిరిపోయాయి.  అది నా లైఫ్ లో మరిచిపోలేనిది. బ్రేకప్ స్టోరీ గురించి మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాలు రిలేషన్ లో ఉన్నామంటే మాటలు కాదు. నాలుగు సంవత్సరాలు ఇంట్లో వాళ్లకు తెలియకుండా అతడిని కలిసేదాన్ని. లవ్ లోచాలా నేర్చుకుంటాం.. ఇప్పుడు నాకు పెళ్లిమీద కూడా ఇంట్రస్ట్ లేదు.. వచ్చే 5 ఏళ్ళు పూర్తిగా కెరియర్ కు కేటాయిస్తా అని చెప్పుకొచ్చింది హారిక. ప్రస్తుతానికి ఎలాంటి ఆఫర్స్ రాలేదని ఒకవేళ వస్తే ఛాలెంజింగ్ రోల్స్ లో నటించాలని ఆసక్తిగా ఉందని తెలిపింది హారిక.

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!