Prabhas Supports Young Hero : మరోసారి మంచి మనసు చాటుకున్న డార్లింగ్.. తండ్రిలేని యంగ్ హీరోలకు అండగా ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మంచి నటుడే కాదు.. మంచి మనసున్న వ్యక్తి. ఇక తనకు నచ్చినవారిని అసలు వదిలి పెట్టడని వారి కోసం ఏమైనా చేస్తాడని ఇండస్ట్రీలో టాక్.. ఇక ప్రభాస్ కెరీర్‌లో మొదటి సక్సెస్..
Prabhas Supports Young Hero :యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మంచి నటుడే కాదు.. మంచి మనసున్న వ్యక్తి. ఇక తనకు నచ్చినవారిని అసలు వదిలిపెట్టడని వారి కోసం ఏమైనా చేస్తాడని ఇండస్ట్రీలో టాక్.. ఇక ప్రభాస్ కెరీర్‌లో మొదటి సక్సెస్ ఇచ్చిన దర్శకుడు అంటే ప్రభాస్ కు అత్యంత ఇష్టమనే సంగతి అందరికీ తెలుసు. అనుకోకుండా ఆ దర్శకుడు హఠాత్తుగా మరణిస్తే.. అతని కొడుకు బాధ్యతను డార్లింగ్ తీసుకున్నాడు. మరి ఆ దర్శకుడు ఎవరో.. అతని తనయుడు యంగ్ ఎవరో తెలిసే ఉంటుంది.. అవును
ఈశ్వర సినిమాతో ప్రభాస్ టాలీవుడ్ లో హీరోగా అడుగు పెట్టాడు. వర్షం మూవీ వరకూ సక్సెస్ అందుకోలేదు. వర్షం సినిమా బాక్సాఫీస్ హిట్ కొట్టడమే కాదు.. ప్రభాస్ కెరీర్ కు బ్రేక్ ఇచ్చింది. దీంతో ఆ సినిమా దర్శకుడు శోభన్ కు ప్రభాస్ కు మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది.. మళ్ళీ వీరిద్దరి కాంబోలో సినిమా అనే టాక్ వినిపించినా పట్టాలెక్కలేదు. అయితే 2008 లో వర్షం డైరెక్టర్ శోభన్ గుండెపోటుతో మరణించాడు.. దీంతో శోభన్ తనయుడు సంతోష్ శోభన్ కు ప్రభాస్ ఎదైనా చెయ్యాలని నిర్ణయించుకున్నట్లున్నాడు. సంతోష్ కు అవసరమైన సమయంలో అన్నగా అండగా నిలబడుతూ.. అతని సినీ కెరీర్ ను గాడిన పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు..
శోభన్ కొడుకు సంతోష్ శోభన్ ఇప్పటికే కొన్ని సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. తను నేను, పేపర్ బాయ్ వంటి సినిమాల్లో హీరోగా నటించాడు.. ఆ సినిమాల ప్రమోషన్ సమయంలో కూడా ప్రభాస్ సాయం చేశాడు..
తాజాగా సంతోష్ కు ప్రభాస్ తన హోమ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ లోనే ఒక సినిమా ఆఫర్ ఇప్పించాడు. సంతోష్ కెరీర్ సెట్ అయ్యేలా చేయాలని ప్రభాస్ యూవీ క్రియేషన్స్ తో చాలా సార్లు చర్చలు జరిపారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన లవ్ స్టోరీలో సంతోష్ హీరోగా నటించాడు. ఈ మూవీ ప్రమోషన్ కోసం ప్రభాస్ రంగంలోకి దిగనున్నాడనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ ను ట్రైలర్ ను ప్రకటించాలని ప్రభాస్ టీమ్ ఆలోచిస్తున్నారంటూ టాక్ వినిపిస్తోంది.. అంతేకాదు ఇంకో రెండు సినిమాలను సంతోష్ తో తన హోమ్ బ్యానర్ లో చేయడానికి ప్రభాస్ ఆలోచిస్తున్నాడట. ఇప్పటికే కథలను రెడీ చేయించే పనిలో ఉన్నాడనేసమాచారం.. ఏది ఏమైనా మనిషి బతికి ఉన్న సమయంలో తమకు చేసిన మేలు మర్చిపోతున్న ఈ రోజుల్లో ప్రభాస్ తనకు హిట్ ఇచ్చిన దర్శకుడు పై ప్రేమతో అతని కొడుకు కోసం సొంత అన్నలా అండగా నిలడ్డ ప్రభాస్ నిజంగా డార్లింగే అంటున్నారు ఫ్యాన్స్
Also Read: