Megastar Chiranjeevi: ‘నాన్నకు ప్రేమతో’.. తండ్రిని స్మరించుకున్న మెగాస్టార్ చిరంజీవి.. వీడియో ఇదిగో

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన తండ్రిని స్మరించుకున్నారు. సోమవారం (డిసెంబర్ 30) వెంకట రావు వర్ధంతి వర్ధంతి సందర్భంగా ఇంట్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి తో పాటు తల్లి అంజనమ్మ, నాగబాబు కుటుంబ సభ్యులు వెంకటరావు కు నివాళి అర్పించారు.

Megastar Chiranjeevi: 'నాన్నకు ప్రేమతో'.. తండ్రిని స్మరించుకున్న మెగాస్టార్ చిరంజీవి.. వీడియో ఇదిగో
Megastar Chiranjeevi
Follow us
Basha Shek

|

Updated on: Dec 30, 2024 | 5:54 PM

మెగాస్టార్ చిరంజీవి తన తండ్రికి నివాళులు అర్పించారు. సోమవారం తన తండ్రి వెంకట రావు వర్ధంతి సందర్భంగా ఇంట్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. చిరంజీవితో పాటు ఆయన తల్లి అంజనమ్మ, సతీమణి సురేఖ, నాగ బాబు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకటరావు చిత్ర పటానికి పూజలు నిర్వహించి నివాళి అర్పించారు. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు చిరంజీవి..’జన్మనిచ్చిన మహానీయుడిని, ఆయన స్వర్గస్తులైన రోజున స్మరించుకుంటూ’ అని తండ్రిపై తన ప్రేమను చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన కొణిదెల వెంకటరావు, అంజనాదేవి దంపతులకు మొత్తం ఐదుగురు సంతానం. మెగాస్టార్‌ చిరంజీవితో పాటు నాగబాబు, పవన్ కల్యాణ్, మాధవి, విజయ దుర్గ అంజనమ్మ దంపతులకు జన్మించారు. వీరిలో చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తోన్న ఈ సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ లో చిరంజీవి సరసన సౌతిండియన్ బ్యూటీ క్వీన్ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఆషికా రంగనాథ్, కునాల్‌ కపూర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలతో అనూహ్యంగా వాయిదా పడింది. దీంతో వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ మెగా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ‍‍అవకాశముంది.

ఇవి కూడా చదవండి

మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..

విశ్వంభర సినిమాలో మెగాస్టార్ చిరంజీవి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.