Godfather: దుమ్మురేపిన ”గాడ్ ఫాదర్” టీజర్.. అదరగొట్టిన మెగాస్టార్
చిరు మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గాడ్ ఫాదర్ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది..
చిరు మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గాడ్ ఫాదర్(Godfather) సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. జెస్ట్ టైటిల్ వీడియోతో యూట్యూబ్ రికార్డులు బద్దలు కొట్టారు. గాడ్ ఫాదర్ ఎలా ఉంటారో మనకు చూపించేసి… నెట్టింట వేరేలెవల్ హంగామాను క్రియేట్ చేశారు. ఇక బ్లాక్ కలర్ అంబాసిడర్లో.. దిగిన గాడ్ ఫాదర్ .. బ్లాక్ డ్రెస్ లో.. బ్లాక్ షేడ్స్ లో.. నెరిసిన గడ్డంతో యామా కూల్ గా కనిపిస్తున్నారు. సునీల్ కారు డోర్ తీయగా దిగిన చిరు.. తన స్టైల్ మూవ్స్ తో ఫ్యాన్స్ లో గూస్ బంప్స్ తెప్పిస్తున్నారు. గూస్ బంప్స్ తెప్పించడమే కాదు.. ఫస్ట్ లుక్ వీడియోనే రిపీటెడ్ మోడ్‌లో వాచ్ చేస్తున్నారు. వారెవ్వా.. బాస్ కు కావాల్సింది ఇదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు .
తాజాగా ఈ సినిమానుంచి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మెగా ఫ్యాన్స్ అంచనాలను ఈ టీజర్ తో నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారు మేకర్స్. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. గాడ్ ఫాదర్ సినిమాను విజయదశమికే రిలీజ్ చేస్తామంటూ గతంలో కన్ఫర్మ్ చేశారు మేకర్స్. దీంతో ఈ సినిమా కోసం ఇప్పటి నుంచే మెగా ఫ్యాన్స్ వెయింటింగ్ షూరూ అయిపోయింది. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే హీరో సత్య దేవ్, సునీల్ ఇతర ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి.