Megastar Chiranjeevi: చిరంజీవి సినిమా ఓపెనింగ్ కోసం కదిలిన ఆ ముగ్గురు స్టార్ హీరోస్.. వైరలవుతున్న త్రోబ్యాక్ పిక్..
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ విజయ బాపినీడు కాంబినేషన్లో అనేక విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి. ఇక వీరి కాంబోలో వచ్చిన గ్యాంగ్ లీడర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత అనేక సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ కేవలం బిగ్ బాస్ మాత్రమే డిజాస్టర్ అయ్యింది.

మెగాస్టార్ చిరంజీవి.. చిత్రపరిశ్రమలో ఎంతమంది నటీనటులకు స్పూర్తి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిన్న చిన్న పాత్రలు పోషించి ఆ తర్వాత హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. తన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇండస్ట్రీలో మెగాస్టార్గా స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ తమ సినిమా ప్రారంభోత్సవానికి.. లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ అతిథిగా.. ట్రైలర్ రిలీజ్ చేస్తే చాలు అని ఎదురుచూస్తుంటారు. అయితే చిరు కెరీర్ ఆరంభించి హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సమయంలో ఆయన కోసం ఏకంగా ముగ్గురు అగ్రహీరోలు వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అందుకు సంబంధించిన త్రోబ్యాక్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. అసలు విషయానికి వస్తే..
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ విజయ బాపినీడు కాంబినేషన్లో అనేక విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి. ఇక వీరి కాంబోలో వచ్చిన గ్యాంగ్ లీడర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత అనేక సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ కేవలం బిగ్ బాస్ మాత్రమే డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత చిరంజీవితో మరో సినిమా చేయాలనుకున్నారట బాపినీడు. ఆ సినిమా పట్టాలెక్కలేదు. డాక్టర్.. ముద్దుకృష్ణ అనే టైటిల్ తో చిరుతో సినిమా చేయాలని ప్లాన్ చేశారు. కానీ అ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇక వీరి కాంబోలో వచ్చిన మరో హిట్ మూవీ ఖైదీ నంబర్ 786.





Megastar Chiranjeevi
1987 అక్టోబర్ 25న వాహినీ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీ ప్రారంభోత్సవానికి ముగ్గురు అగ్ర హీరోలు కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు హాజరయ్యారు. చిరంజీవి, భానుప్రియపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్ కు కృష్ణంరాజు కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. శోభన్ బాబు తొలి క్లాప్ ఇచ్చారు. ఇక తొలి సన్నివేశానికి కృష్ణ దర్శకత్వం వహించారు. ఇలా నలుగురు హీరోలు ఒకే వరుసలో నిలబడి గ్రూప్ ఫోటో దిగారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరలవుతుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.




