God Father: మెగాస్టారా మజాకా.. రికార్డ్ ధరకు “గాడ్ ఫాదర్” ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ అయ్యేది అక్కడే

మెగాస్టార్ చిరంజీవి సినిమాకోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆచార్య సినిమా తర్వాత మెగాస్టార్ నటిస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింట్ శరవేగంగా జరుగుతోంది.

God Father: మెగాస్టారా మజాకా.. రికార్డ్ ధరకు గాడ్ ఫాదర్ ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ అయ్యేది అక్కడే
Megastar
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 22, 2022 | 10:44 AM

మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆచార్య సినిమా తర్వాత మెగాస్టార్ నటిస్తున్న సినిమా గాడ్ ఫాదర్(God Father). మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింట్ శరవేగంగా జరుగుతోంది. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నయన తార మెగాస్టార్ చిరంజీవికి సిస్టర్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమానుంచి మార్ మార్ థక్కర్ మార్ అనే పాటను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది.

గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్ తో పాటు సల్మాన్ ఖాన్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాంతో ఈ సినిమాకు బిజినెస్ కూడా అదే రేంజ్‌లో జరుగుతోంది. తాజాగా గాడ్ ఫాదర్ మూవీ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది. ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ గాడ్ ఫాదర్ మూవీ డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుందట.. దాదాపు 75 కోట్ల కు మెగాస్టార్ సినిమాను దక్కించుకుందని టాక్. ఇక ఈ సినిమాలో సత్యదేవ్, సునీల్, అనసూయ, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..