Unstoppable with NBK : బాలయ్య టాక్ షోకు ఆ స్టార్ హీరోయిన్ గెస్ట్‌గా రానుందా..?

నటసింహం నందమూరి బాలకృష్ణ మొదటిసారిగా హోస్ట్ చేసిన అన్ స్టాపబుల్ షో ఈ రేంజ్ లో క్లిక్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో గర్జించే బాలయ్య టాక్ లో మాత్రం చాలా సరదాగా నవ్వుతు, నవ్విస్తూ అలరిస్తున్నారు.

Unstoppable with NBK : బాలయ్య టాక్ షోకు ఆ స్టార్ హీరోయిన్ గెస్ట్‌గా రానుందా..?
Unstoppable 2
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 22, 2022 | 10:05 AM

నటసింహం నందమూరి బాలకృష్ణ మొదటిసారిగా హోస్ట్ చేసిన అన్ స్టాపబుల్ షో(Unstoppable with NBK )ఏ రేంజ్ లో క్లిక్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో గర్జించే బాలయ్య టాక్ లో మాత్రం చాలా సరదాగా నవ్వుతు, నవ్విస్తూ అలరిస్తున్నారు. తనదైన కామెడీ టైమింగ్ తో వచ్చిన గెస్ట్ లను తికమక పెడుతూ.. నవ్వులు పూయించారు బాలకృష్ణ. అన్ స్టాపబుల్ మొదటి సీజన్ పూర్తయిన తర్వాత సీజన్ 2 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్. త్వరలోనే అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదలుకానుంది తెలిపారు ఆహా టీమ్. సీజన్ వన్ లో చాలా మంది సెలబ్రెటీలు హాజరయ్యి బాలయ్యతో సందడి చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో బాలయ్య తనదైన స్టైల్ లో నవ్వులు పూయించారు. ఇక ఇప్పుడు సీజన్ 2 కు ఎవరు గెస్ట్ లుగా వస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే బాలయ్య షోకు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రానున్నారంటూ గతకొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి, మెగాస్టార్ తో ఈ షో సెకండ్ సీజన్ మొదలవుతుందని టాక్ గట్టిగా వినిపించింది. అలాగే  పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది.  ఇదిలా ఉంటే ఇప్పుడు గెస్ట్ గా వచ్చే వారిలో మరో పేరు వినిపిస్తోంది. బాలయ్య షోకి అందాల భామ అనుష్క శెట్టి గెస్ట్ గా రానుందని అంటున్నారు. అనుష్క ఆచితూచి సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న సినిమాలో అనుష్క నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనుష్క ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలో బాలయ్య షోకు ఆమె వస్తుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాలంటే మరికొంతకాలం ఎదురుచూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం