AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జైలుకెళ్లి వచ్చిన మారని బుద్ధి.. తండ్రి ముగ్గురు కొడుకులను పోలీసులు ఏం చేశారో తెలుసా..?

తండ్రి ముగ్గురు కొడుకులను ఏకంగా జిల్లా నుంచి బహిష్కరిస్తూ కర్నూలు జిల్లా పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హత్య కేసులతో పాటు దౌర్జన్యాలు బెదిరింపులు తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ కుటుంబంపై ఏకంగా జిల్లా బహిష్కరణ విధించడం అత్యంత సంచలనంగా మారింది. దీంతో నేరస్తుల్లో గుబులు పుడుతోంది.

జైలుకెళ్లి వచ్చిన మారని బుద్ధి.. తండ్రి ముగ్గురు కొడుకులను పోలీసులు ఏం చేశారో తెలుసా..?
Kurnool District Police
J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Dec 30, 2025 | 2:32 PM

Share

తండ్రి ముగ్గురు కొడుకులను ఏకంగా జిల్లా నుంచి బహిష్కరిస్తూ కర్నూలు జిల్లా పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హత్య కేసులతో పాటు దౌర్జన్యాలు బెదిరింపులు తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ కుటుంబంపై ఏకంగా జిల్లా బహిష్కరణ విధించడం అత్యంత సంచలనంగా మారింది.

కర్నూలు నగరంలోని షరీన్ నగర్ క్రిమినల్స్ అడ్డా మారింది. ఈ ఏడాది మార్చి 11వ తేదీన కాలనీకి చెందిన టీడీపీ నేత సంజన్న దారుణహత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో రౌడీ షీటర్ వడ్డే రామాంజనేయులు అలియాస్ అంజి ప్రధాన నిందితుడుగా పోలీసులు గుర్తించారు. తండ్రి తోపాటు ముగ్గురు కొడుకులు వడ్డే తులసి కుమార్, వడ్డే శివకుమార్, వడ్డే రేవంత్ కుమార్‌లు సైతం ఈ ఘటనలో నిందితులుగా ఉన్నారు. వీరు నలుగురిపై కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో రౌడీషీట్ కూడా ఉంది.

ఈ నలుగురు వ్యక్తులు అరెస్ట్ అయినప్పటికీ బెయిల్ పై వచ్చినప్పటికీ వీరిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లా పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తండ్రీకొడుకులను జిల్లా నుంచి బహిష్కరిస్తే మార్పు వస్తుందేమోనని భావించారు. వీరిపై చర్యలు తీసుకుంటే, మిగతా క్రిమినల్స్ కూడా భయపడతారేమో అనే ఉద్దేశంతో జిల్లా బహిష్కరణకు నిర్ణయించారు. అందులో భాగంగానే తండ్రి ముగ్గురు కుమారులను జిల్లా బహిష్కరించాలని కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపారు.

జిల్లా ఎస్పీ ప్రతిపాదన మేరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి మొదట డిసెంబర్ 11వ తేదీన వడ్డే రామాంజనేయులు అలియాస్ అంజి ని జిల్లా బహిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత మూడు రోజుల క్రితం వడ్డే తులసి కుమార్‌ను కూడా జిల్లా నుంచి బహిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా మరో ఇద్దరు రామాంజనేయులు కొడుకులు శివకుమార్, రేవంత్ కుమార్ లను కూడా జిల్లా నుంచి బహిష్కరిస్తూ ఉత్తర్వులు రావడం సంచలనంగా మారింది.

ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరుగుతున్న నేర సంఘటనలలో ప్రత్యక్షంగా పరోక్షంగా కొందరు రౌడీషీటర్ల ప్రమేయం ఉండటం, జైలుకు వెళ్లి వచ్చినా కూడా మార్పు రాకపోవడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తండ్రి ముగ్గురు కొడుకులు జైలులో ఉండటం పట్ల వారి కుటుంబం చిన్న భిన్నం అయినట్లేనని భావిస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో జిల్లాలో ఇప్పటివరకు ఐదుగురిని జిల్లా బహిష్కరణకు ఉత్తర్వులు జారీ అయ్యాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ చెప్తున్నారు. రౌడీయిజంతో అరాచక శక్తులుగా మారితే, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే, శాంతి భద్రతలకు విఘాతం కలుగజేస్తే జిల్లా బహిష్కరణతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపిస్తాం అని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా క్రిమినల్స్ మారాలని సూచిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..