Ori Devuda: ‘ఓరి దేవుడా’… అనుకోని సర్‌ప్రైజ్‌. అదిరిపోయే ట్విస్ట్‌ ఇచ్చిన వెంకీ మామా..

Ori Devuda: విశ్వక్‌ సేన్‌ హీరోగా మిథిలా పాల్కర్‌ జంటగా నటిస్తోన్న చిత్రం 'ఓరి దేవుడా'. పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు...

Ori Devuda: 'ఓరి దేవుడా'... అనుకోని సర్‌ప్రైజ్‌. అదిరిపోయే ట్విస్ట్‌ ఇచ్చిన వెంకీ మామా..
Ori Devuda
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 22, 2022 | 6:44 AM

Ori Devuda: విశ్వక్‌ సేన్‌ హీరోగా మిథిలా పాల్కర్‌ జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఓరి దేవుడా’. పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంలో ‘ఓ మై కడవులే’తో వచ్చి భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. తమిళంలో దర్శకత్వం వహించిన మరిముత్తు తెలుగులోనూ తెరకెక్కిస్తుండడం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ ఇటీవల ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. అయితే తాజాగా ఆడియన్స్‌కు ఊహించని అప్‌డేట్‌ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ సినిమాలో కీలక పాత్రలో విక్టరీ వెంకటేష్‌ నటించనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర యూనిట్ గ్లింప్స్‌ వీడియోను విడుదల చేసింది. అంతేకాకుండా చిత్రాన్ని అక్టోబర్‌ 21న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. చడీచప్పుడు లేకుండా ఇంత పెద్ద సర్‌ప్రైజ్‌ ఇచ్చిన చిత్ర యూనిట్‌ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్‌ దేవుడి పాత్రలో నటిస్తున్నారు. తమిళంలో వచ్చిన మాతృత వెర్షన్‌ ‘ఓ మై కడవులే’లో ఈ పాత్రలో విజయ్‌ సేతుపతి నటించిన విషయం తెలిసిందే. విభిన్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న వెంకటేష్‌ ఈ చిత్రంతో ప్రేక్షకులను ఏ రేంజ్‌లో అలరిస్తారో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..