Mohanlal: మోహన్ లాల్ ఇంట్లో తీవ్ర విషాదం.. తల్లి శాంతకుమారి కన్నుమూత..
మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి శాంతకుమారి కన్నుమాశారు. చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆమె.. మంగళవారం కొచ్చిలోని మోహన్ లాల్ ఎలమక్కర ఇంట్లో తుదిశ్వాస విడిచారు. ఆమె అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ తల్లి శాంతకుమారి కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 90 సంవత్సరాలు. దాదాపు పదేళ్లుగా పక్షవాతం, అనారోగ్య సమస్యల కారణంగా చికిత్స తీసుకుంటున్న ఆమె.. మంగళవారం మధ్యాహ్నం కొచ్చిలోని ఎలమక్కరలోని మోహన్ లాల్ ఇంట్లో తుదిశ్వాస విడిచారు. శాంతకుమారి భర్త మాజీ లీగల్ సెక్రటరీ, దివంగత విశ్వనాథన్ నాయర్. ఆమె అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నారు. శాంతకుమారి చివరి సమయంలో ఆమె వెంట సంరక్షకులు ఉన్నట్లు సమాచారం. తల్లి మరణవార్త తెలియగానే మోహన్ లాల్ ఎర్నాకుళంలోని తన ఇంటికి చేరుకున్నారు. ఈ రాత్రికి శాంతకుమారి పార్థివదేహాన్ని తిరువనంతపురం తీసుకువెళ్లనున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి : Folk Song : యూట్యూబ్లో కోట్ల వ్యూస్.. నెల రోజులుగా ఇంటర్నెట్ షేక్.. ఇప్పటికీ దూసుకుపోతున్న పాట..
మోహన్ లాల్ తన తల్లి 89వ పుట్టినరోజున ఎలమక్కరలో ఒక సంగీత ప్రదర్శన ఇచ్చారు. శాంతకుమారి అమ్మ లక్కలోని తన ఇంటికి సమీపంలోని అమృత ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆమె చాలా కాలంగా నగరంలోని ముదవన్ముగల్ కేశవదేవ్ రోడ్డులోని ‘హిల్‌వ్యూ’ అనే ఇంట్లో నివసిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : The Paradise: కాంబో అదిరింది భయ్యా.. నానితో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్.. ది ప్యారడైజ్ నుంచి క్రేజీ అప్డేట్..
మోహన్ లాల్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన సినీరంగంలో అందించిన సేవలకు గానూ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్నారు. మలయాళంతోపాటు తెలుగులోనూ పలు సినిమాల్లో కీలకపాత్రలు పోషించారు.
ఇవి కూడా చదవండి : Vinay Rai: అప్పుడు హీరోగా.. ఇప్పుడు విలన్గా.. ఈ నటుడి ప్రియురాలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఎవరంటే.
