AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: కాస్మెటిక్ సర్జరీలపై జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు.. ‘బఫెలో-ప్లాస్టీ’, అందం కోసం చేసిన వాటిపై క్లారిటీ!

ఆమె ఒక స్టార్ హీరోయిన్, స్టార్ ప్రొడ్యూసర్ కూతురు. వెండితెరపై తన తల్లి సృష్టించిన ప్రభంజనాన్ని తలపిస్తూ సినిమాల్లోకి అడుగుపెట్టింది. కానీ ఆమె ముఖకవళికలు, ముక్కు ఆకారం, పెదవుల తీరుపై విమర్శకుల నుంచి ఎప్పుడూ ఏదో ఒక విమర్శ వస్తూనే ఉంటుంది.

Janhvi Kapoor: కాస్మెటిక్ సర్జరీలపై జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు.. ‘బఫెలో-ప్లాస్టీ’, అందం కోసం చేసిన వాటిపై క్లారిటీ!
Jahnvi Kapoor
Nikhil
|

Updated on: Feb 19, 2026 | 6:30 AM

Share

రైనోప్లాస్టీ, లిప్ ఫిల్లర్స్ వంటి సర్జరీలు చేయించుకుందని నెటిజన్లు ఫోటోలు పెట్టి మరీ ట్రోల్ చేస్తుంటారు. సాధారణంగా ఇలాంటి విషయాలపై హీరోయిన్లు మౌనంగా ఉంటారు. కానీ ఈమె మాత్రం అందుకు భిన్నంగా ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ షోలో తన సర్జరీల గుట్టు విప్పింది. బఫెలో-ప్లాస్టీ వంటి వింత వార్తలపై ఆమె స్పందించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

నా అందం.. నా ఇష్టం

ఆ నటి మరెవరో కాదు.. అతిలోక సుందరి తనయ జాన్వీ కపూర్. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ‘పర్ఫెక్ట్’ గా కనిపించాలనే ఒత్తిడి ఉంటుందని జాన్వీ అంగీకరించింది. సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రతి ఒక్కరూ ఇతరుల రూపం గురించి తీర్పులు ఇస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సర్జరీల గురించి మాట్లాడుతూ.. “నేను ఎప్పుడూ ఏ విషయాన్ని దాచాలని అనుకోను. మీకు ఏది సంతోషాన్ని ఇస్తే అది చేయండి అనే తత్త్వం నాది. పర్ఫెక్ట్ గా కనిపించాలనే ఆలోచనను యువతులకు నేను రుద్దాలనుకోవడం లేదు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అది మీ వ్యక్తిగత నిర్ణయం” అని జాన్వీ స్పష్టం చేసింది.

ఆన్‌లైన్‌లో తనపై వస్తున్న కొన్ని వింతైన వార్తలను చూసి జాన్వీ నవ్వుకుంది. ముఖ్యంగా ‘బఫెలో-ప్లాస్టీ’ అనే పేరుతో కొందరు వైద్యులు చేస్తున్న వీడియోలపై ఆమె ఘాటుగా స్పందించింది. “నేను నా అందం కోసం ఏది చేసినా చాలా తెలివిగా, పద్ధతిగా, తక్కువ మోతాదులోనే చేశాను. ఇందులో నాకు మా అమ్మ మార్గదర్శకత్వం ఎప్పుడూ ఉండేది. ఒకవేళ నన్ను చూసి ఎవరో ఒక చిన్నారి కూడా ఇలాంటి పనులు చేయాలని ప్రయత్నించి ఏదైనా తప్పు జరిగితే అంతకంటే దారుణం మరొకటి ఉండదు. అందుకే ఇలాంటి విషయాల్లో పారదర్శకత ఉండాలని నేను కోరుకుంటున్నాను” అని జాన్వీ చెప్పుకొచ్చింది.

కాజోల్ మద్దతు..

ఈ షోలో పాల్గొన్న సీనియర్ నటి కాజోల్ కూడా జాన్వీ మాటలతో ఏకీభవించింది. తన కూతురు నైసా దేవగణ్ పై కూడా ఇలాంటి విమర్శలే వస్తున్నాయని ఆమె గుర్తు చేసుకుంది. “నైసా, నేను కలిసి 25 సర్జరీలు చేయించుకున్నామని కొన్ని సైట్లు కథనాలు రాస్తున్నాయి. అసలు ఆ 25 పనులు ఏంటో నాకు అర్థం కావడం లేదు” అని కాజోల్ ఎద్దేవా చేసింది. దేవుడు మనల్ని ఒకలా సృష్టిస్తే, మనకు నచ్చినట్లు కనిపించడానికి మేకప్ ఉంది.. అది ఒక వ్యక్తిగత ఇష్టమని కాజోల్ అభిప్రాయపడింది.

జాన్వీ కపూర్ ఇటీవల ‘సన్నీ సంస్కారి కి తులసి కుమారి’, ‘హోమ్ బౌండ్’ వంటి సినిమాల్లో మెరిసింది. ప్రస్తుతం ఆమె తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ సినిమాలో నటిస్తోంది. ఎన్టీఆర్ సరసన ‘దేవర’ సినిమాతో ఇప్పటికే టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ఈ సుందరి, ఇప్పుడు తన గ్లామర్ తో పాటు తన నిజాయితీతో కూడిన మాటలతో అందరినీ ఆకట్టుకుంటోంది. అందం అనేది కేవలం ముఖానికి సంబంధించిన విషయం కాదు, అది మన ఆత్మవిశ్వాసానికి సంబంధించింది అని జాన్వీ మాటలు నిరూపిస్తున్నాయి. పబ్లిక్ లైఫ్ లో ఉన్న సెలబ్రిటీల రూపంపై విమర్శలు చేయడం సులభమే కానీ, వారు పడే మానసిక ఒత్తిడిని అర్థం చేసుకోవడం ముఖ్యం.

Follow Us
ఎండతో పనిలేకుండా ఆరు నెలలు నిల్వ ఉండే టమాటో పచ్చడి
ఎండతో పనిలేకుండా ఆరు నెలలు నిల్వ ఉండే టమాటో పచ్చడి
పైసా ఖర్చు లేకుండా చిన్న కుండీలో గుత్తులు గుత్తులుగా పచ్చిమిర్చి
పైసా ఖర్చు లేకుండా చిన్న కుండీలో గుత్తులు గుత్తులుగా పచ్చిమిర్చి
ప్రపంచ కుబేరుల రహస్య సమ్మర్ క్యాంప్.. సాధారణ ప్రజలకు నో ఎంట్రీ..!
ప్రపంచ కుబేరుల రహస్య సమ్మర్ క్యాంప్.. సాధారణ ప్రజలకు నో ఎంట్రీ..!
ఏషియన్ గేమ్స్‌ నుంచి తెలుగోడు.. వన్డే టీం నుంచి పంత్, పాండ్యా ఔట్
ఏషియన్ గేమ్స్‌ నుంచి తెలుగోడు.. వన్డే టీం నుంచి పంత్, పాండ్యా ఔట్
బాల్కనీ నుండి బల్లులను ఎలా వదిలించుకోవాలి?
బాల్కనీ నుండి బల్లులను ఎలా వదిలించుకోవాలి?
ప్లాస్టిక్ దేవతా విగ్రహాలను పూజించవచ్చా..? శాస్త్రాల్లో అసలు ఏం ఉ
ప్లాస్టిక్ దేవతా విగ్రహాలను పూజించవచ్చా..? శాస్త్రాల్లో అసలు ఏం ఉ
మహిళల కోసం ప్రత్యేక లుక్‌లో నోయిస్​ స్మార్ట్‌వాచ్​
మహిళల కోసం ప్రత్యేక లుక్‌లో నోయిస్​ స్మార్ట్‌వాచ్​
ఎంఎస్ సుబ్బలక్ష్మీ బయోపిక్‏లో నేషనల్ క్రష్..
ఎంఎస్ సుబ్బలక్ష్మీ బయోపిక్‏లో నేషనల్ క్రష్..
రద్దీ బస్సుల్లో బంగారు నగలు కాజేసే లేడీ కిలాడీ అరెస్ట్..
రద్దీ బస్సుల్లో బంగారు నగలు కాజేసే లేడీ కిలాడీ అరెస్ట్..
ఛాతీలో నొప్పి వచ్చిందా? ఈ ఒక్క పని మాత్రం ఆలస్యం చేయకండి..
ఛాతీలో నొప్పి వచ్చిందా? ఈ ఒక్క పని మాత్రం ఆలస్యం చేయకండి..