AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

54 ఏళ్ల వయసులో 20 కిలోల బరువు తగ్గిన కుష్బూ.. ఆ అద్భుతమైన మార్పు వెనుక రహస్యం ఇదే!

ఆమె ఒకప్పుడు సౌత్ ఇండియాను ఊపేసిన అగ్ర కథానాయికలో ఒకరు. ప్రస్తుతం రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా కొనసాగుతున్నారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. "ఇది నిజంగా ఆమెనేనా?" అని ఆశ్చర్యపోతున్నారు. తమ అభిమాన హీరోయిన్‌ గుర్తుపట్టలేనంతగా మారిపోయి యువ హీరోయిన్లకు దీటుగా కనిపిస్తున్నారని మురిసిపోతున్నారు.

54 ఏళ్ల వయసులో 20 కిలోల బరువు తగ్గిన కుష్బూ.. ఆ అద్భుతమైన మార్పు వెనుక రహస్యం ఇదే!
Khushboo Sundarr
Nikhil
|

Updated on: Feb 19, 2026 | 6:35 AM

Share

54 ఏళ్ల వయసులో మునుపటి గ్లామర్ ను సొంతం చేసుకుంటూ ఏకంగా 20 కిలోల బరువు తగ్గింది. కొందరు ఆమె ఇంజెక్షన్లు వాడుతోందని ట్రోల్ చేసినా, ఆమె మాత్రం తన కష్టాన్ని నమ్ముకుంది. ఆ ఫిట్‌నెస్ ఐకాన్ మరెవరో కాదు.. ఖుష్బూ సుందర్. ఆమె వెయిట్ లాస్ వెనుక ఉన్న కఠోర శ్రమ, సమాజంలోని అపోహలను ఆమె ఎలా తుడిచిపెట్టేసిందో తెలుసుకుందాం.

లాక్ డౌన్ లో మొదలు..

ఖుష్బూ బరువు తగ్గే ప్రయాణం 2020 పాండమిక్ సమయంలో మొదలైంది. అప్పట్లో ఆమె బరువు 93 కిలోలు. అప్పటి నుండి క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని ఆమె అలవాటు చేసుకుంది. యోగా, ప్లాంక్స్ మరియు కఠినమైన ఆహార నియమాలను పాటిస్తూ తన శరీరాన్ని చెక్కుకుంది. ఆమె ఫిట్‌నెస్ పట్ల చూపిస్తున్న అంకితభావాన్ని చూసి ప్రముఖ దర్శకుడు ఆనంద్ కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె ప్రతిరోజూ 10 వేల నుండి 15 వేల అడుగులు నడుస్తుందని, ప్రయాణాల్లో ఉన్నా సరే నడకను మాత్రం అస్సలు విస్మరించదని ఆయన వెల్లడించారు.

Khushboo Sundarr..

Khushboo Sundarr..

చాలామంది 40 ఏళ్లు దాటిన తర్వాత బరువు తగ్గడం అసాధ్యమని భావిస్తారు. కానీ కుష్బూ ఈ క్రింది అపోహలను పటాపంచలు చేసింది.

  • వయసు పెరిగే కొద్దీ మెటబాలిజం నెమ్మదించడం నిజమే కానీ, అది పూర్తిగా ఆగిపోదు. మనం శారీరక శ్రమను తగ్గించి, పాత ఆహారపు అలవాట్లను మార్చుకోకపోవడం వల్లే బరువు పెరుగుతాం.
  • బరువు తగ్గాలంటే కేవలం నడక లేదా రన్నింగ్ మాత్రమే సరిపోదు. కండరాల బలం పెంచే వ్యాయామాలు కూడా అవసరం. కండరాలు ఎంత బలంగా ఉంటే క్యాలరీలు అంత వేగంగా కరుగుతాయి.
  • మెనోపాజ్ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల బరువు పెరగడం సహజం. అయితే ఒత్తిడి తగ్గించుకోవడం, సరైన నిద్ర మరియు పోషకాహారం తీసుకోవడం ద్వారా వీటిని అధిగమించవచ్చు.

“ఇక నా వల్ల కాదు” అని అనుకునే వారికి ఖుష్బూ సుందర్ ఒక గొప్ప ఉదాహరణ. 54 ఏళ్ల వయసులో ఆమె సాధించిన ఈ మార్పు కేవలం అందం కోసం కాదు, ఆరోగ్యం కోసం. సరైన ఆలోచనా విధానం, నిలకడైన ప్రయత్నం ఉంటే వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఆరోగ్యంగా మారవచ్చు.

Follow Us